Home » Actress Meena : రెండో పెళ్లికి సిద్ధమైన మీనా…అసలు విషయం ఇదే ?

Actress Meena : రెండో పెళ్లికి సిద్ధమైన మీనా…అసలు విషయం ఇదే ?

by Bunty
Ad

 

Actress Meena : అలనాటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకుంది ఈ భామ. స్టార్ హీరోలు అందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక మీనా సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇక వివాహ అనంతరం మీనా కొద్ది రోజులపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. మళ్లీ సినిమాల్లో రాణిస్తున్న మీనా ఒకానొక సంఘటన వల్ల మానసికంగా బాధపడుతోంది.


గత కొద్ది రోజులక్రితం తన భర్త అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఇక తన భర్త మరణానంతరం మీనా తన కూతురిని చూసుకుంటూ సింగిల్ గానే ఉంటుంది. ఈ క్రమంలోనే మీనా రెండో పెళ్లి చేసుకుంటుందంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ వాటిని కొట్టి పారేసింది. మీనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ తనకి ఓ చేదు అనుభవం ఎదురైంది. సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడం ప్రతి ఒక్కరికి చాలా కామన్ అయిపోయింది. సెలబ్రిటీల పర్సనల్ విషయాలను లాగడం, వారిని ఇబ్బందిపెట్టడం చాలా కామన్ అవుతుంది. ఈ క్రమంలోనే మీనాని కూడా ఓ రిపోర్టర్ ఇబ్బంది పెట్టే ప్రశ్నని అడిగాడు.

Advertisement


మీరు చాలా అందంగా ఉన్నారు…. వయసు కూడా చాలా తక్కువే… రెండో పెళ్లి చేసుకుంటారా… అని అడిగాడు. ఈ ప్రశ్నకి మీనా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆ రిపోర్టర్ పదేపదే అదే ప్రశ్నను అడుగుతున్నాడు. దీంతో మీనా కాస్త కోపంతో “పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు ఇప్పుడు లేదు… అలా అని సింగిల్ గా ఉంటానని కూడా చెప్పలేను… ప్రస్తుతం నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. తక్కువ వయసు ఉందని, అందంగా ఉన్నానని నేనెప్పుడూ అనుకోలేదు. ముందు నా గురించి కాకుండా నా కూతురుపైనే నా దృష్టి పెట్టాను” అంటూ రిపోర్టర్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆ రిపోర్టర్ సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం మీనా చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading