Home » మేడారం జాతర.. అక్కడ నాలుగు రోజులు సెలవులు..!

మేడారం జాతర.. అక్కడ నాలుగు రోజులు సెలవులు..!

by Anji
Ad

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర…తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన ముగులు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ జాతర ఫిబ్రవరి 21 నుంచి మొదలై 24వ తేదీ వరకు సాగనుంది. ఈ జాతరకు సంబంధించి ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేశారు. రవాణా పరంగానూ తెలంగాణ ఆర్టీసీ 6వేల స్పెషల్ బస్సులను కూడా నడుపుతోంది. ఇటు మేడారం జాతరకు వచ్చే భక్తులకోసం జంపన్న వాగు, పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Advertisement

మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. 4 రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 4 రోజుల పాటు జిల్లాలో ఉన్న విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించారు. ఆదివారం సెలవు కావడంతో వరుసగా 5రోజుల పాటు సెలవులు వచ్చాయి. సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తూ..2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. అయితే మేడారం జాతీయ జాతీయ హోదాను కల్పించాలంటూ ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తూనే ఉంది.

 

అటు రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్దెత్తున తరలివస్తారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21,22,23,24వ తేదీల్లో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలువు ప్రకటించినట్లు ఆదేశాలు జారీ చేశారు.

Also Read :  లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. పీపుల్స్‌ పల్స్‌-సౌత్‌ఫస్ట్‌ సర్వే ఇదే..!

Visitors Are Also Reading