Home » మాతృదేవత మూవీ సూపర్ హిట్ అయినా అప్పుల పాలైన సావిత్రి..కారణం..?

మాతృదేవత మూవీ సూపర్ హిట్ అయినా అప్పుల పాలైన సావిత్రి..కారణం..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి మేటినటుల్లో మొదటి స్థానంలో నిలుస్తారు మహానటి సావిత్రి. ఈమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో సావిత్రి హీరోయిన్ గా చేస్తుంది అంటే ఆ సినిమా తప్పనిసరిగా సూపర్ హిట్. అంతటి నటనాచాతుర్యం కలిగిన మహానటి సావిత్రి జీవితంలో అనుకోని విషాదాల వల్ల చాలా దారుణమైన, దుర్భర పరిస్థితులు అనుభవించాల్సి వచ్చింది. అలాంటి మహానటి సావిత్రి హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చాలా సంపాదన పోగు చేసి విలాసంతమైన జీవితాన్ని గడిపారు. కొంతకాలానికి ఆమెకు వయసు మీద పడటంతో హీరోయిన్ ఛాన్సులు తగ్గడంతో దర్శకత్వ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

also read;కైకాల సత్యనారాయణ కొడుకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..!!

1967లో మొత్తం మహిళా భాగస్వాములుగా శ్రీమాతా ప్రొడక్షన్స్ లిమిటెడ్ అనే సినీ కంపెనీని నెలకొల్పారు. మొత్తం 12 మంది. వీరమాచినేని సరోజినీ దేవి అనే ఆవిడ ఆ కంపెనీని చూసుకునేది. మూవీ పేరు చిన్నారి పాపలు. ఈ సినిమా కథ సరోజినీ దేవిదే. ఈ సినిమాలో సంగీతం నుంచి మొదలు ఫైట్స్ వరకు అన్ని మహిళలే చేయాలనేది లక్ష్యం. ఈ సమయంలో సావిత్రిని దర్శకత్వం చేయమని ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించారు. సినిమా షూటింగ్ అయిపోయింది మూవీ విడుదలైంది. పెట్టిన పెట్టుబడి సగమే వచ్చింది. మిగతా నష్టాన్ని పూడ్చడానికి సావిత్రికి బంగారం సొంత ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగతా భాగస్వాములు తప్పించుకున్నారు.

Advertisement

ఇక సావిత్రి అక్కడితో ఆగిపోతే ఏ గొడవ ఉండేది కాదు. మళ్లీ ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేసింది. అక్కడ కూడా డిజాస్టర్. దీని తర్వాత కూడా ఎన్టీఆర్ తో మాతృదేవత, చలంతో చిరంజీవి సినిమాలకు దర్శకత్వం వహించడానికి ఒప్పుకున్నారు. నిర్మాతలు వేరే వారైనా సావిత్రి గ్యారెంటీ సంతకం పెట్టుకున్నారు. మాతృదేవత సూపర్ హిట్ అయింది. అయినా సావిత్రికి అనుకున్నంత డబ్బు రాలేదు. వాహిని స్టూడియో పక్కన ఉన్న ఆరెకరాల పొలాన్ని అమ్ముకున్నారు. చివరికి జగ్గయ్యతో వింత కాపురం అనే సినిమా తీస్తే, అది కూడా దెబ్బతీసింది. ఈ విధంగా ఆమె నిర్మాణరంగం దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత దెబ్బ మీద దెబ్బ పడడంతో కోలుకోలేని పరిస్థితికీ వచ్చింది.

Also read;బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ల పేర్లు లీక్…ఆ బ్యూటీఫుల్ సింగ‌ర్, స్టార్ క‌పుల్ ఎంట్రీ ఫిక్స్..!

Visitors Are Also Reading