Home » కైకాల సత్యనారాయణ కొడుకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..!!

కైకాల సత్యనారాయణ కొడుకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మచ్చలేని పేరు తెచ్చుకున్నారు కైకాల సత్యనారాయణ. ఆయన ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ పొందాడు. కైకాల చేయని పాత్ర అంటూ లేదు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకే వన్నె తెచ్చే విలక్షణ నటుడు సత్యనారాయణ. అలాంటి ఆయన పలు అనారోగ్య సమస్యల వల్ల ఈరోజు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగింది.ఈ క్రమంలోనే ఆయన గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరుణంలో ఆయన వారసుల గురించి పలు వార్తలు బయటకు వస్తున్నాయి.

Advertisement

Also read;చిరంజీవి:కైకాల సత్యనారాయణకు ఆ రెండంటే చాలా ఇష్టం..!!

మరి అవేంటో పూర్తిగా తెలుసుకుందాం.. కైకాల సత్యనారాయణ అంత పెద్ద స్టార్ నటుడైన ఆయన వారసులు మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం వారి అభిరుచి ఏంటో తెలుసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ప్రోత్సహించారు. వారు సినిమాల్లోకి రావాలనుకుంటే రావద్దు అని చెప్పను, లేదా బిజినెస్ చేస్తానంటే చేసుకోమంటాను అనే విషయాన్ని తెలియజేశాడు. ఈ విధంగా ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసి కైకాల సత్యనారాయణ ఇద్దరు కుమారులు వ్యాపార రంగంలో స్థిరపడి ఇప్పటివరకు ఏనాడు మీడియా కంటపడలేదు..

Advertisement

ఆ విధంగా వారు ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా వారి పని వారు చేసుకుంటూ ఉండేవారు. అలాంటి సత్యనారాయణ కుమారుడు యంగ్ హీరో యష్ నటించిన కేజిఎఫ్ సినిమాను తెలుగులో డబ్బింగ్ రైట్స్ ను కొని ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ విధంగా కైకాల సత్యనారాయణ కుమారులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే చివరిసారిగా కేజిఎఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ మా కుమారుడు ప్రొడక్షన్ రంగంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు కైకాల సత్యనారాయణ.

also read;నాన్న-బాబాయ్ నెల రోజుల వ్యవధిలో మరణించడానికి కారణం వెల్లడించిన శ్వేత లక్ష్మీపతి..!

Visitors Are Also Reading