Home » బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ల పేర్లు లీక్…ఆ బ్యూటీఫుల్ సింగ‌ర్, స్టార్ క‌పుల్ ఎంట్రీ ఫిక్స్..!

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ల పేర్లు లీక్…ఆ బ్యూటీఫుల్ సింగ‌ర్, స్టార్ క‌పుల్ ఎంట్రీ ఫిక్స్..!

by AJAY

బిగ్ బాస్ సీజన్ 6 డిసెంబర్ 18 పూర్తైంది. ఈ సీజన్ లో విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. అంతే కాకుండా రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ ల వరకు యూత్ కూడా ఈ షో ను చూశారు. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి పాపుల‌ర్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వ‌కపోవడం…పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో చూడటం మానేశారు. కానీ బిగ్ బాస్ కు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. చాలామంది మహిళలు ఈ షో చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే బిగ్ బాస్ 7వ సీజ‌న్ ను ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా షురూ అయినట్టు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. ప్రతి సీజన్ లోనూ ఓ సింగర్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారన్న సంగతి తెలిసిందే. రాహుల్… రేవంత్ కూడా అలా వచ్చి ట్రోఫీ గెలుచుకున్న‌వారే…. అయితే ఈ సీజన్ లో కూడా ఓ సింగ‌ర్ ను తీసుకోబోతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

Mohana bogaraju biography

Mohana bogaraju biography

బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా…. అనే పాట పాడి ఎంతో పాపులర్ అయిన సింగర్ మోహన భోగరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో బిబి టీం సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. అంతేకాకుండా ఈ సీజన్ లో కూడా మరో కపుల్ ను బిగ్ బాస్ లోకి తీసుకురావాలని బీబీ టీం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సీరియల్ హీరో అమర్ దీప్ చౌద‌రి మరియు తేజస్విని గౌడ్ జంట‌ను ఎంపిక చేసిన‌ట్టు టాక్. బీబీ ఇచ్చిన ఆఫ‌ర్ కు కొత్త క‌పుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సీజ‌న్ లో రానా లేదా బాల‌య్య హోస్ట్ గా చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కూడా టాక్.

Visitors Are Also Reading