Home » సల్మాన్ సోదరి ఇంట్లో భారీ చోరీ.. ఆ వస్తువుల ఖరీదు ఎంతో తెలుసా ?

సల్మాన్ సోదరి ఇంట్లో భారీ చోరీ.. ఆ వస్తువుల ఖరీదు ఎంతో తెలుసా ?

by Anji
Ad

 ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ఇళ్లలో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోని కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరు కుమార్తెల ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇది దొంగతనం పని వాళ్ళు చేశారని పోలీసుల విచారణలో బయటపడింది. అయితే తాజాగా మరొక బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Advertisement

ఇక ఈయనకు తన చెల్లెలు అర్పితా ఖాన్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎన్నోసార్లు బయటపడింది. అయితే తాజాగా అర్పిత ఖాన్ ఇంట్లో దొంగలు పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి ఈమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అర్పిత ఖాన్ ఇంట్లో ఏ వస్తువులు దొంగిలించబడ్డాయి వాటి విలువ ఎంత ఏంటి అనే విషయానికి వస్తే.. అర్పితా ఖాన్ చెవిపోగులు దొంగతనానికి గురైనట్లు తెలుస్తోంది.

Advertisement

 

డైమండ్ తో పొదిగి ఉన్నటువంటి ఈ చెవి పోగులు కనిపించకపోవడంతో ఈమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసు విచారణలో భాగంగా తన ఇంట్లో పని చేసే సందీప్ హెగ్డే అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు బయటపడింది. అర్పితా ఖాన్ ఇంట్లో దాదాపు 11 మంది పనివాళ్ళు ఉన్నారు. దొంగతనం జరిగినప్పటి నుంచి సందీప్ హెడ్డే కనిపించకపోవడంతో పోలీసులు తనని ట్రాప్ చేసి చివరికి పట్టుకున్నారు. అయితే తానే ఆ దొంగతనం చేసినట్లు సందీప్ హెగ్డే ఒప్పుకోవడం గమనార్హం. అయితే ఈమె చెవి పోగులను మేకప్ ట్రేలో పెట్టి ఉండగా వాటిని దొంగిలించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలా వరుసగా సెలబ్రిటీల ఇళ్లల్లో దొంగతనాల గురించి బయటకు రావడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్ సినిమాపై బండ్ల గణేష్ సంచలన ట్వీట్.. ‘నా టైటిల్ కొట్టేశారంటూ’..!

భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లోనే భారీ న‌ష్టాల‌ను తీసుకువ‌చ్చిన సినిమాలు ఇవే..!

 

Visitors Are Also Reading