Home » భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లోనే భారీ న‌ష్టాల‌ను తీసుకువ‌చ్చిన సినిమాలు ఇవే..!

భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లోనే భారీ న‌ష్టాల‌ను తీసుకువ‌చ్చిన సినిమాలు ఇవే..!

by AJAY
Ad

ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలను నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉంటారు. అలా భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు కొన్ని సందర్భాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేయడంతో ఆ మూవీలకు భారీ నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలా ఇప్పటివరకు భారీ బడ్జెట్ తో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయి భారీ నష్టాలను అందుకున్న టాప్ 7 ఇండియన్ మూవీలు ఏవో తెలుసుకుందాం.

 

Advertisement

సూపర్ స్టార్ రజనీకాంత్ కొంతకాలం క్రితం కోచ్చాడయ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీని పూర్తిగా యనిమేషన్ పద్ధతిలో రూపొందించారు ఈ మూవీ ద్వారా 83 కోట్ల నష్టం వచ్చిందట.

రన్బీర్ కపూర్ హీరోగా రూపొందిన శంషారా మూవీ 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా ఈ సినిమా కేవలం 63 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టి 86 కోట్ల నష్టాలను ఎదుర్కొంది.

Advertisement

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన తలైవి మూవీని 100 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా కేవలం 4.7 కోట్ల కలెక్షన్లను మాత్రమే వసూలు చేసి 85 కోట్ల భారీ నష్టాలను ఎదుర్కొంది.

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన ధాకడ్ మూవీ 85 కోట్లతో రూపొంది. 2 కోట్ల కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. ఈ మూవీ ద్వారా 82 కోట్ల నష్టాలు నిర్మాతలకు వచ్చాయి.

అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన బచ్చన్ పాండే మూవీకి 91 కోట్ల నష్టాలు వచ్చాయి.

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్ సినిమా 350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొంది… 214 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 136 కోట్ల నష్టాలను ఎదుర్కొంది.

 

అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ 300 కోట్ల బడ్జెట్ తో రూపొంది 210 కోట్ల నష్టాలను ఎదుర్కొని భారీ ఫ్లాప్ గా నిలిచింది.

Visitors Are Also Reading