Home » Mar 7th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 7th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

కోనసీమ అల్లర్ల కేసులు తొలగింపుపై చర్చలు కొనసాగుతున్నాయి. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళ పై జరిగిన దాడి కేసులు మినహాయిస్తే మిగిలిన కేసులు తొలగింపునకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ లో వింత శిశువు జన్మించాడు. రెండు గుండెలు, నాలుగు కాళ్లతో వింత శిశువు జననం జరిగింది.

Advertisement

నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. చెరుకు సుధాకర్, కొడుకు సుహాస్ ని చంపేస్తానని బెదిరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ఐపీసీ 506 కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (మం) గుంటుపల్లి లో వీధి కుక్క స్వైర విహారం చేశాయి. బాలికను తీవ్రంగా గాయపరిచాయి. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులపై కూడా దాడి చేశాయి.

కేయూ మహిళా హాస్టల్లో ఎలుకల బెడద వేధిస్తోంది. నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి.

గోదావరి ఖని ఆర్ఎఫ్‌ సీఎల్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. సాంకేతిక సమస్యతో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాదిలో ఉత్పత్తి నిలిచిపోవడం ఇది నాలుగవ సారి కావటం గమనార్హం.

Advertisement

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఉద్యమంలోకి వెళ్తామని ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డికి ఏపీ అమరావతి జేఏసీ నోటీసులు అందించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరోవ్యక్తిని అరెస్ట్ చేశారు. రామచంద్ర పిళ్ళై ను అరెస్ట్ చేశారు.

modi

ఇవాళ నాగాలాండ్, మేఘాలయ సీఎంల ప్రమాణ స్వీకారం జరగనుంది. కొనరాడ్ సంగ్మా నేతృత్వంలో మేఘాలయలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 

నేషనలిస్టు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత రియో నేతృత్వంలో నాగాలాండ్ లో ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రమాణ స్వీకారోత్సవాలకు హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.

ఎంతో టాలెంట్ ఉన్న ప్రీతి లాంటి అమ్మాయిని పోగొట్టుకున్నామని గవర్నర్ తమొలిసై అన్నారు. నేను మహిళల కోసం పని చేస్తూనే ఉంటాను. నన్ను తిట్టిన వారికి శిక్ష వేయకుండా అవార్డులు, రివార్డులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.. అయినా, నేను తట్టుకుంటున్నాను అంటూ గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Visitors Are Also Reading