Telugu News » Blog » Mar 11th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 11th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ads

Advertisement

నేడు ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీగా బీ కార్యకర్తలు ఆమె ఇంటివద్దకు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కవిత ఇంటికి చేరుకున్నారు.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో కిరణ్ కుమార్ రెడ్డి టచ్ లో ఉన్నారు. జాతీయ స్థాయిలో పదవి కట్టబెడతామని కిరణ్ కు బీజేపీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

నేడు ఉదయం 10 గంటల తర్వాత ఢిల్లీ తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి నుంచి ఈడీ ఆఫీస్ కు కవిత వెళ్లనున్నారు. దాంతో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారత జాగృతి నేతలు ఢిల్లీ చేరుకున్నారు.

పెద్దపల్లి జిల్లాలో 25వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో యాత్ర ఫర్ ఛేంజ్ కొనసాగనుంది. ఉదయం 9:00 గంటలకు ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీ సందర్శించి… ఉదయం 11:30 గంటలకు మెట్ పల్లి పసుపు మార్కెట్ ను సందర్శించనున్నారు.

Advertisement

తిరుమలలో 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,443 మంది భక్తులు దర్శించుకున్నారు.

మోడీ ప్రభుత్వం 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ, ఐటీ దాడుల పేరుతో సోనియాను అవమానించిందన్నారు.

హైదరాబాద్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. రేపు రాత్రి 8.25కి హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం సీఐఎస్‌ఎఫ్‌ పరేడ్‌లో పాల్గొననున్నారు.

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ అన్నారు. నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. వీలైతే పాదయాత్రలు చేయాలని… డిసెంబర్‌లో ఎన్నికలకు ప్లాన్‌చేసుకోవాలని చెప్పారు.