Telugu News » అక్క‌డ మందుబాబుల‌కు పండుగే పండుగ‌.. దొరికినోడికి దొరికినంత‌..!

అక్క‌డ మందుబాబుల‌కు పండుగే పండుగ‌.. దొరికినోడికి దొరికినంత‌..!

by Anji
Published: Last Updated on

కాలం సంబంధం లేకుండా జ‌నంతో కిట‌కిట‌లాడే దుకాణం ఏదైనా ఉందా..? అంటే మ‌ద్యం దుకాణం మాత్ర‌మే. రేట్లు ఎంత పెరిగినా.. కానీ మ‌ద్యం కొనుగోలుకు వెన‌క్కి త‌గ్గేదేలే అని అంటున్నారు మందుబాబులు. అలాంటిది మ‌ద్యం ఫ్రీగా వ‌స్తుందంటే ఇక మందుబాబులు వ‌దిలిపెడ‌తారా..? మ‌ద్యం స్టాకుతో వెళ్తున్న లారీ బోల్తాప‌డ‌డంతో కింద‌ప‌డిన బాటిళ్లు ఎత్తుకెళ్లేందుకు మ‌ద్యం ప్రియులు పోటీప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Ads


మ‌ధురై జిల్లా విరంగ‌నూర్ జాతీయ ర‌హ‌దారిపై మ‌ద్యం లోడుతో వెళ్తున్న లారీ బుధ‌వారం మ‌ధ్యాహ్నం బోల్తా ప‌డింది. అందులో ఉన్న లిక్క‌ర్ బాటిళ్ల మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. లారీ బోల్తా ప‌డ‌డం చూసి అటుగా వెళ్తున్న వాహ‌న‌దారులు వెంట‌నే త‌మ వాహ‌నాల‌ను రోడ్డు ప‌క్క‌కు ఆపారు. లారీ డ్రైవ‌ర్, క్లీన‌ర్‌కు ఏమైనా దెబ్బ‌లు త‌గిలాయా అన్న‌ది ప‌ట్టించుకోకుండా అందిన కాడికి బాటిళ్ల‌ను ఎత్తుకెళ్లారు. కొందరు అయితే ఏకంగా రెండు, మూడు బాక్సుల‌ను నెత్తిన పెట్టుకునిపోయారు.

ఇక మ‌న‌లూరు మ‌ద్యం గోడౌన్ నుండి త‌మిళ‌నాడుకు రూ.10ల‌క్ష‌ల విలువైన మ‌ద్యం బాటిళ్ల‌ను లారీలో త‌ర‌లిస్తుండ‌గా.. ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంటున్న‌ట్టు పోలీసులు తెలిపారు. అతివేగం కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. మ‌ద్యం బాటిళ్ల‌ను ఎత్తుకుపోతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. అదృష్టం అంటే మీదే అని ఒక‌రు కామెంట్ చేస్తే.. జీవితంలో మ‌ళ్లీ ఇలాంటి అరుదైన ఆఫ‌ర్ దొర‌క‌దంటూ మ‌రొక‌రు కామెంట్ చేశారు.

Also Read : 

న‌మ్ర‌త గాసిప్స్ అస‌లు విన‌లేము.. చెవులు మూసుకుంటా అంటున్న మ‌హేష్‌బాబు..!

మీ భ‌ర్త మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్నాడా లేదా..? ఎలా ఉండాలంటే..?

 


You may also like