Home » వెన్నెల కిషోర్ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టలు.. శిక్ష తప్పదా?

వెన్నెల కిషోర్ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టలు.. శిక్ష తప్పదా?

by Bunty
Ad

దేశ పెద్దన్న బ్యాంకు అయినా రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరకు అందుబాటులో ఉన్న 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్. రద్దు అనే పదం వాడకుండా ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంకు ప్రకటన చేయడం ఇక్కడ విశేషం. ఇక ఈ రద్దు చేసిన నోట్లను మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకులలో మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Advertisement

అలాగే ఖాతాదారులకు 2000 రూపాయల నోట్లను ఇవ్వకూడదని బ్యాంక్ అధికారులకు కీలక సూచనలు చేసింది రిజర్వ్ బ్యాంక్. దీంతో ఇప్పటినుంచే 2000 రూపాయల నోట్లు ఖాతాదారులు మార్చేసుకుంటున్నారు. 2016లో ఎదురైన పరిస్థితులను గుర్తించుకొని… ఇప్పుడే సన్నద్ధమవుతున్నారు ఖాతాదారులు. అయితే ఈ తరుణంలోనే 2000 రూపాయల నోట్ల గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వార్తకు మంచు హీరో మంచి విష్ణు కారకుడు అయ్యాడు.

Advertisement

టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇంట్లో 2 వేల రూపాయల నోట్ల కట్టలను చూసినట్లు మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. నేను ఒకసారి వెన్నెల కిషోర్ ఇంట్లోకి వెళితే… అతని ఇంట్లో ₹2000 కట్టలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి… ఇప్పుడు నోట్లు రద్దు అయ్యాయి. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఏం చేస్తాడో అంటూ రాసుకు వచ్చాడు మంచు విష్ణు. ఇప్పుడు మంచు విష్ణు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

సమంత లాగే బరితెగించిన రష్మిక?

Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

Visitors Are Also Reading