Home » కన్నప్పగా అదరగొట్టిన మంచు విష్ణు.. ఆకర్షిస్తున్న ఫస్ట్ లుక్..!

కన్నప్పగా అదరగొట్టిన మంచు విష్ణు.. ఆకర్షిస్తున్న ఫస్ట్ లుక్..!

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విష్ణు మూవీతో హీరోగా ఎంట్రీ గా ఇచ్చాడు. ఇక మంచు విష్ణు చివరిగా జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మంచు విష్ణు. ‘కన్నప్ప: ది గ్రేట్ ఎపిక్ ఇండియన్ టేల్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు విష్ణు.

Advertisement

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి మూవీ పై అందరిలో ఆసక్తి నెలకొంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చాలా మంది నటులు నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సినిమా పై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు లుక్ ను రిలీజ్ చేశారు. శివరాత్రి సందర్భంగా మార్చి 08, 2024న  మంచు విష్ణు లుక్‌ను రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ శివుడి భక్తుడైన కన్నప్ప పాత్రలో నటిస్తున్న మంచు విష్ణు లుక్ వదిలారు మేకర్స్. విల్లు ఎక్కుపెట్టి కన్నప్పగా కనిపించాడు విష్ణు.

Advertisement

ఒక అద్భుతమైన సన్నివేశంలో, అతను జలపాతం నుండి బయటకు వచ్చి లక్ష్యం పై బాణం ఎక్కుపెట్టి కనిపించాడు. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని ఈ కొత్త పోస్టర్ హింట్ ఇచ్చేలా ఉంది. ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’, ‘ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లోనే జరుగుతోంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్స్ లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో దాదాపు 600 మంది పాల్గొన్నారు.

Also Read :  పేరు మార్చుకున్న మెగా హీరో.. ఇక నుంచి ఆ పేరుతోనే..!

Visitors Are Also Reading