Home » మంచు మనోజ్ రెండో పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టేనా..?

మంచు మనోజ్ రెండో పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టేనా..?

by Anji
Ad

మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి గత కొద్ది రోజుల నుంచి చర్చ కొనసాగుతున్న విషయం విధితమే. భూమా మౌనికరెడ్డి, మనోజ్ పెళ్లిని చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు వీరి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయినట్టు ఫిలిం సర్కిల్ అంతా కోడై కూస్తున్నారు. మార్చి 03న మౌనిక రెడ్డి మెడలో మనోజ్ తాలి కట్టబోతున్నారని.. ఇప్పటికే పెళ్లి పనులు పూర్తయ్యాయని పేర్కొంటున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫంక్షన్ మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

ప్రముఖ రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన మౌనిక రెడ్డికి గతంలో పెళ్లి జరిగి విఫలం చెందింది. అదేవిధంగా మనోజ్ కూడా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. ఇక వీరద్దరూ కూడా రెండో పెళ్లితో ఒకటి కాబోతున్నట్టు సమాచారం. పెళ్లి తేదీకి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 

Advertisement

Also Read :  లైగర్ కి ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

Manam News

2004లో దొంగదొంగది చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.ఆ తరువాత బిందాస్ చిత్రంతో నంది అవార్డు అందుకున్నాడు. తరువాత వేదం, ఝుమ్మందినాదం, కరెంట్ తీగ, రాజుభాయ్ వంటి చిత్రాలతో మెప్పించాడు. పలు ఫ్లాప్స్ పడే సరికి సినిమాలకు దూరమయ్యాడు మనోజ్. ఆరేళ్ల బ్రేక్ తరువాత మనోజ్ తన కొత్త సినిమాతో ష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. వాట్ ది ఫిష్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాని ఎప్పుడు మొదలు పెడుతారో ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.  

Also Read :  నిన్ను ప్రేమించిన వ్యక్తి గుండె ఇదేనా.. లవర్ కి పంపింతే ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading