Home » మంచు మనోజ్ మౌనిక రెడ్డిల పెళ్లి పై అప్డేట్…. ముహూర్తం ఎప్పుడంటే…?

మంచు మనోజ్ మౌనిక రెడ్డిల పెళ్లి పై అప్డేట్…. ముహూర్తం ఎప్పుడంటే…?

by AJAY
Published: Last Updated on
Ad

మంచు మోహన్ బాబు నట వారసుడిగా మనోజ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన మనోజ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మనోజ్ తన భార్యతో విడాకులు తీసుకున్న నాటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే కొంతకాలంగా మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ లో చిరు త‌మ్ముడిగా శ్రీకాంత్ నే ఎందుకు తీసుకున్నారు..? తెర‌వెన‌క ఇంత క‌థ న‌డిచిందా..?

Advertisement

గణేష్ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ లో ప్రముఖ రాజకీయనేత భూమా నాగిరెడ్డి శోభ దంపతుల రెండో కుమార్తె మౌనికతో కలిసి మనోజ్ ఓ గణేష్ మండపానికి వెళ్లి పూజలు చేశాడు. ఆ సమయంలో మీడియా తో మాట్లాడుతూ త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని అన్నాడు. దాంతో ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Also Read:  ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిసిన 5 హాలీవుడ్ చిత్రాలు…!

Advertisement

ఆనాటి నుండి మనోజ్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మౌనిక రెడ్డి వివాహం సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారని… కానీ సామాజిక వర్గాలు వేరు కావడంతో భూమా నాగిరెడ్డి పెళ్లికి ఒప్పుకోలేదని వార్తలు వినిపించాయి. కాగా ఇప్పటికే మౌనిక రెడ్డికి సైతం విడాకులు కాగా ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఇద్దరూ విడాకుల తర్వాత మళ్ళీ కలిశారని చెన్నై లో కొంతకాలం డేటింగ్ లో కూడా ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ మౌనిక రెడ్డి పెళ్లికి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనోజ్ మౌనిక రెడ్డిని 2023 ఫిబ్రవరి 2వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం మనోజ్ హైదరాబాద్ లో మౌనిక రెడ్డి తో కలిసి ఉంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.

Also Read:  అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ పెళ్లి డేట్ ఫిక్స్..!

Visitors Are Also Reading