Home » ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిసిన 5 హాలీవుడ్ చిత్రాలు…!

ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిసిన 5 హాలీవుడ్ చిత్రాలు…!

by AJAY
Ad

హాలీవుడ్ సినిమాలను ఇండియన్ ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టంగా చూస్తారు. ఇప్పటివరకు చాలా హాలీవుడ్ సినిమాలు మనదేశంలో భారీ వసూళ్లను రాబట్టాయి. అంతేకాకుండా క్రేజ్ ఉన్న హాలీవుడ్ సినిమాలకు ఇండియన్ సినిమాల రేంజ్ లో మొదటి రోజు వసూళ్లు వస్తుంటాయి.

Advertisement

రీసెంట్ గా డిసెంబర్ 16న జేమ్స్ కెమెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా దాదాపు ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో విడుదల అయింది. అవతార్ పార్ట్ 1 కు వచ్చిన క్రేజ్ తో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా చాలా సెంటర్ల లో హౌస్ ఫుల్ అయింది.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాకు మొదటి రోజు 41 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు విడుదలైన హాలీవుడ్ చిత్రాలలో అత్యధికంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు వచ్చాయి. ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 53 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

అంతేకాకుండా స్పైడర్ మ్యాన్ సినిమాకు ఇండియాలో తొలి రోజు 32 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇది ఇలా ఉండగా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాకు సైతం ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా 31 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. వీటితోపాటు డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స ఆఫ్ మ్యాడ్ నెస్ సినిమాకు ఇండియాలో ఫస్ట్ డే 27 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

Visitors Are Also Reading