Home » సన్యాసం తీసుకోబోతున్న మంచు లక్ష్మీ.. కారణం అదేనా ?

సన్యాసం తీసుకోబోతున్న మంచు లక్ష్మీ.. కారణం అదేనా ?

by Anji
Ad

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. మోహన్ బాబు తనయురాలుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక విధంగా ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మీ గురించి ఓ వార్త వైరల్ గా మారుతుంది. అది ఏంటంటే..? మంచు లక్ష్మీ సన్యాసం తీసుకోబోతుంది అంటూ.. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక అసలు విషయం లోకి వెళ్తే.. మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో  హైదరాబాద్ నుండి తన మకాం ముంబయి కి మార్చిన విషయం  మన అందరికీ తెలిసిందే. అయితే ముంబయి లో సినిమా అవకాశాల కోసమే అక్కడికి వెళ్లిందని అందరూ భావించారు. ఇక సినిమాల్లో అవకాశాలు లేకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో తన కి సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడూ  షేర్ చేస్తూ నిత్యం నెట్టింట్లో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఓ స్టార్ హీరో కూతురు ఇలా పొట్టి పొట్టి దుస్తులు ధరించి నెట్టింట్లో ఫోటోలు షేర్ చేస్తే.. కచ్చితంగా ట్రోల్ చేస్తారు నెటిజన్స్. అలా మంచు లక్ష్మీ ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి ట్రోల్స్ ని ఎదుర్కొంది.

Advertisement

తాజాగా మంచు లక్ష్మి చాలా పద్ధతిగా వైలెట్ కలర్ సారీ కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని కనిపించింది. అయితే ఎంతో పద్ధతిగా ఉన్న మంచు లక్ష్మీ తన మెడలో ఎలాంటి నెక్లెస్లు కానీ, చైన్లు కానీ, మంగళసూత్రం కానీ ధరించలేదు. వీటన్నింటినీ పక్కన పెట్టి తన మెడలో లాకెట్ తో ఉన్న జపమాలను వేసుకోవడంతో ఈమె ఫొటోస్ చూసిన చాలా మంది నెటిజన్లు ఏంటి..? మంచు లక్ష్మి ఏమైనా సన్యాసం తీసుకోబోతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.  అంతేకాదు.. మరికొందరూ  నెటిజన్స్ అయితే మంచు లక్ష్మీ కి జీవితం మీద విరక్తి పుట్టిందా ఏంటి..?  ఇలా సన్యాసం తీసుకొని తన జీవితాన్ని గడపాలి అనుకుంటుందా..? అని ఇలా ఎవరికి తోచిన విధంగా  వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతుండటం విశేషం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading