Home » అల్లు అరవింద్ కు ఫోన్లోనే దమ్కీ ఇచ్చిన మమ్ముట్టి.. కారణం ఏంటంటే..?

అల్లు అరవింద్ కు ఫోన్లోనే దమ్కీ ఇచ్చిన మమ్ముట్టి.. కారణం ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎక్కువగా కన్నడ,మలయాళ, తమిళ్,భోజ్ పూరి ఇండస్ట్రీకి చెందిన హీరోలు తెలుగు మరియు హిందీ సినిమాల్లో విలన్స్ గా చేయడానికి ఇష్టపడుతుంటారు.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ జల్సా సినిమా లో విలన్ క్యారెక్టర్ కోసం మమ్ముట్టిని సంప్రదించాడు.. అప్పుడు మమ్ముట్టి ఫోన్లో ఇచ్చిన రిప్లై చూసి ఫోన్ కట్ చేశాడట అరవింద్.. ఆనాడు జరిగిన సందర్భాన్ని మమంగం ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను 10 సంవత్సరాల క్రితం ఒకసారి మమ్ముట్టి గారికి కాల్ చేశాను..

Advertisement

also read:పరిగడుపున టీ తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..?

Advertisement

సార్ మా చిత్రంలో ఒక మంచి పాత్ర ఉంది.. మీరు తప్పకుండా చేయాలని అడిగాను.. దీంతో మమ్ముట్టి గారు ఏం క్యారెక్టర్ అది అని అడిగారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తారు మీరు మంచి విలన్ క్యారెక్టర్ చేయాలని చెప్పారు.. దీంతో కోపానికి వచ్చిన మమ్ముట్టి ఆహా అట్లాగా.. మీరు ఒకసారి చిరంజీవిని చేయమని అడగండి, చిరంజీవిని అడగగలవా అంటూ ప్రశ్నించారట మమ్ముట్టి..

నేను అడగలేనండి అని చెప్పారట అరవింద్.. మరి నాకెందుకు కాల్ చేస్తావు నన్నెందుకు అడుగుతున్నావు అని తిరిగి ప్రశ్నించారట మమ్ముట్టి.. దీంతో అల్లు అరవింద్ సారీ సార్ అంటూ ఫోన్ కట్ చేసాడట.. ఈ విధంగా జల్సా సినిమా టైంలో జరిగిన ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు అల్లు అరవింద్.. ఈ విషయం అరవింద్ బయట పెట్టడంతో జల్సా లో ముఖేష్ ఋషి క్యారెక్టర్ మమ్ముట్టి చేసి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకొని షాక్ అవుతున్నారు నెటిజన్స్..

also read:

Visitors Are Also Reading