Home » రాజేంద్ర‌ప్రసాద్ మాళ‌విక మ‌ధ్య అస‌లేం జ‌రిగింది…ఆమెను ఎందుకు బ్యాన్ చేశారు..!

రాజేంద్ర‌ప్రసాద్ మాళ‌విక మ‌ధ్య అస‌లేం జ‌రిగింది…ఆమెను ఎందుకు బ్యాన్ చేశారు..!

by AJAY
Published: Last Updated on
Ad

చాలా బాగుంది సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌మైన హీరోయిన్ మాళ‌విక‌. ఈ సినిమాకు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా శ్రీకాంత్ సినిమాలో హీరోగా న‌టించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటూ మాళ‌విక‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. అయినప్ప‌టికీ మాళ‌విక తెలుగులోకేవ‌లం ఐదు సినిమాలు మాత్ర‌మే చేసింది. ఆ త‌ర‌వాత త‌మిళ, మ‌ళ‌యాల సినిమాల్లో ఎక్కువ‌గా న‌టించింది. ఇదిలా ఉంటే ఆలీ హోస్ట్ గా చేస్తున్న ఆలీతో స‌ర‌దాగా అనే టాక్ షోకు మాళ‌విక‌ వ‌చ్చింది.

Also Read: స్వర్గీయ ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన 10 అద్భుతమైన పథకాలు ఏవో తెలుసా ?

Advertisement

malavika rajendraprasad

malavika rajendraprasad

ఈ షోలో మాళ‌విక కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలో తమిళ హీరోల గురించి మాళ‌విక మాట్లాడుతూ…హీరో విజ‌య్ ఎక్కువగా మాట్లాడ‌ని చాలా సైలెంట్ గా ఉంటార‌ని చెప్పింది. అంతే కాకుండా హీరో అజిత్ చాలా సింపుల్ గా ఉంటార‌ని ఎక్కువ‌గా మేక‌ప్ వేసుకోర‌ని షాట్ కు షాట్ కు కేవ‌లం ఫేస్ వాష్ చేసుకుంటార‌ని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తాను ర‌జినీకాంత్ తో క‌లిసి చంద్ర‌ముఖి అనే సినిమాలో న‌టించాన‌ని ఆయ‌న స్టార్ హీరోలా అస్స‌లు ప్ర‌వ‌ర్తించ‌రని ఎంతో సింపుల్ గా ఉంటార‌ని తెలిపింది.

Advertisement

malavika

malavika

ఇక హీరో క‌మల్ హాస‌న్ తోనూ తాను సినిమా చేసాన‌ని ఆయ‌న చాలా బ్రిలియంట్ అని తెలివైన వార‌ని చెప్పింది. అయితే టాలీవుడ్ హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ విష‌యానికి వ‌చ్చేస‌రికి మాళ‌విక స‌మాధానం దాట వేసింది. గ‌ట్టిగా నవ్వేస్తూ దాని గురించి నేను మాట్లాడ‌ను. ఇప్ప‌టికే చాలా కాంట్ర‌వ‌ర్సి జ‌రిగింది. ఇక వ‌ద్దు అంటూ ఆన్స‌ర్ చెప్పలేదు. అయితే గ‌తంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ మాళ‌విక మ‌ధ్య ఓ గొడ‌వ జ‌రింగింది.

వీరిద్ద‌రూ క‌లిసి అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అనే సినిమాలో నటించారు. కాగా త‌న‌ను రాజేంద్ర‌ప్రసాద్ లైగింకంగా వేధించాడంటూ మాళ‌విక కేసు పెట్టింది. దాంతో మాళ‌విక‌ను కొంత‌కాలం పాటూ టాలీవుడ్ లో బ్యాన్ చేశారు. త‌ప్పెవ‌రిదో తెలియ‌దు కానీ మాళ‌విక‌ను బ్యాన్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి త‌న కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?

Visitors Are Also Reading