Telugu News » మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌ల్లిదండ్రుల‌తో అడివిశేష్ భేటీ..!

మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌ల్లిదండ్రుల‌తో అడివిశేష్ భేటీ..!

by Anji

టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ పాత్ర‌ల‌తో న‌టిస్తూ.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అడివి శేష్. తాజాగా ఈయ‌న మేజ‌ర్ సినిమాలో 26/11 దాడుల్లో అసువులు బాసిన రియ‌ల్ హీరో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ తల్లిదండ్రులు అయిన ఉన్నికృష్ణ‌న్, ధ‌న‌ల‌క్ష్మీ దంప‌తుల‌ను క‌లిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు అడివిశేష్‌. ఆయ‌న టైటిల్ రోల్ ప్లే చేస్తూ న‌టించిన చిత్రం మేజ‌ర్. ఎప్పుడో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా.. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 11న దేశ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టిస్తూ.. ఓ మేకింగ్ వీడియోను విడుద‌ల చేసారు. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల‌లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో మేజ‌ర్ చిత్రాన్ని మ‌రొక‌సారి వాయిదా వేశారు.

Ads

 అడివి శేష్.. తెలుగులో డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక మూసకు పరిమితం కాకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఐడెండిటీ ఏర్పరుచుకున్నారు. తాజాగా ఈయన ‘మేజర్’ సినిమాలో 28/11 దాడుల్లో అసువులు బాసిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులైన ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి దంపతులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా  మర్యాద పూర్వకంగా కలవడంతో వారి ఆశీర్వాదం తీసుకున్నారు అడివి శేష్. (Twitter/Photo)

ముంబై 26/11 తీవ్ర‌వాద దాడుల్లో వీర‌మ‌ర‌ణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న‌ది. మేజ‌ర్ చిత్రాన్ని గూఢ‌చారి ఫేమ్ శ‌శికిర‌ణ్ తిక్కా తెర‌కెక్కించారు. సోనీ పిక్చ‌ర్స్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్‌, ఏ ప్ల‌స్ ఎస్ మూవీస్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి. సందీప్ ఉన్ని కృష్ణ‌న్ ఫ్యామిలీది కేర‌ళ‌లోని కోజిగ‌డ్‌. వీళ్ల ఫ్యామిలీ బెంగ‌ళూరులో స్థిర‌ప‌డ్డారు. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ వారి త‌ల్లిదండ్రుల‌కు ఏకైక కుమారుడు. వాళ్ల నాన్న ఉన్ని కృష్ణ‌న్ ఇస్రోలో శాస్త్రవేత్త‌గా ప‌ని చేసి రిటైర్డ్ అయ్యారు.

 అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’ సినిమా విషయానికొస్తే.. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. కానీ అనూహ్యంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఈ సినిమా విడుదలను మరోసారి వాయిదా వేసారు. (Twitter/Photo)

1995లో పూణేలోని నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మిలో జాయిన్ అయ్యారు. మేజ‌ర్ సందీప్ ఉన్నీ కృష్ణ‌న్ నేహాను పెళ్లి చేసుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధంలో భార‌త్ విజ‌యంలో కూడా కీల‌క పాత్ర వ‌హించారు. ముంబైలో జ‌రిగిన 26%17 దాడుల్లో తీవ్ర‌వాదుల‌తో పోరాడి అసువులు బాసారు. ఈ పోరాటంలో సందీప్ చూపించిన తెగువ‌కు కేంద్రం ఆయ‌న‌ను అశోక చ‌క్ర అవార్డుతో స‌త్క‌రించింది. అంతేకాదు ఆయ‌న జ్ఞాప‌కార్థం బెంగ‌ళూరులో యెల‌హంక‌లో ఆయ‌న ఉంటున్న రోడ్డుకు మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ రోడ్డుగా నామ‌క‌ర‌ణం చేశారు.

 మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. మరోవైపు అడివి శేష్.. ‘గూఢచారి’ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)

తెలుగుతో పాటు హిందీ, మ‌ల‌యాలం వంటి మూడు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. మేజ‌ర్ సినిమాను 120 ప‌ని దినాల‌లో షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రం ప్ర‌త్యేకంగా హోట‌ల్ సెట్ స‌హా 8 సెంట్లు వేశారు. ఈ దాడుల్లో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ తో హ‌వాల్దార్ గ‌జేంద్ర‌సింగ్‌, అశోక్ కామ్టే, హేమంత్ క‌ర్క‌రే, విజ‌య్ స‌లాస్క‌క‌ర్‌, తుకారాం ఓబ్లే ముష్క‌రుల‌తో పోరాడుతూ.. అమ‌రులు అయ్యారు. దేశ‌వ్యాప్తంగా 75 లోకేష‌న్‌ల‌లో ఈ చిత్రానికి పిక్చ‌రైజ్ చేసారు. మేజ‌ర్ మూవీని తెలుగు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో మూడు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మేజ‌ర్ త‌రువాత అడ‌వి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో కూడా న‌టిస్తున్నారు. అయితే మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ త‌ల్లిదండ్రుల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన‌ట్టు ప్ర‌క‌టించారు అడివిశేష్‌.


You may also like