Telugu News » Blog » నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా స్పెషల్ అంటున్న మహేష్..ఎవరంటే..?

నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా స్పెషల్ అంటున్న మహేష్..ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇప్పటికే ఇండస్ట్రీలో అనేక సినిమాలు తీసి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజాం మహేష్ బాబుది.. అలాంటి హీరో పుట్టినరోజు సందర్భంగా చాలా మంది అభిమానులు కేక్ కట్ చేసి ఇతర సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

అయితే మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూ మాట్లాడినప్పుడు తన జీవితంలో ఇంపార్టెంట్ అయినా వ్యక్తుల గురించి చెప్పారు. ప్రస్తుతం ఆ మాటలే వైరల్ అవుతున్నాయి. మరి ఆ స్పెషల్ వ్యక్తులు ఎవరయ్యా అంటే.. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంటే చాలా ఇష్టమట.. అలాగే మహేష్ బాబు భార్య నమ్రత అంటే కూడా అమితమైన ప్రేమ అని అన్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో మంది దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Advertisement

వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు చాలా కాలం పాటు సైలెంట్ గా లవ్ చేసుకుని.. ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఈ విషయాన్ని చెప్పారు.. కానీ మహేష్ ఫ్యామిలీ వీరి పెళ్లి కి ఒప్పుకోలేదు.. చివరికి వాళ్ల స్టైల్లో ఎలాగైనా పెళ్లి కి ఒప్పించి చివరికి ఒకటయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు. మంచి పొజిషన్లో ఉన్న వీరు చాలా హ్యాపీగా ఇతరులకు రోల్ మోడల్ గా బతుకుతున్నారు.నేను ఎంత ఎదిగినా నా తల్లి చేతితో అన్నం తినడమే ఇష్టమని మహేష్ బాబు చాలా సందర్భాల్లో చెబుతాడు.

also read;

Advertisement

You may also like