Home » బింబిసార2 కథ అదేనా…?

బింబిసార2 కథ అదేనా…?

by Azhar
Ad

కళ్యాణ్ రామ్ హీరోగా తాజాగా విడుదల అయిన బింబిసార అనే సినిమా భారీ విజయం అందుకుంది. మొదట ఈ సినిమా పైన ఎవరికీ అంచనాలు అనేవి లేకున్నా కూడా విడుదల సమయానికి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక విడుదల తర్వాత బింబిసార కూడా ఆ అంచనాలు ఆందుకుంది. దాంతో ఎప్పటి నుండో సూపర్ హిట్ కోసం చూస్తున కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా బంపర్ హిట్ అనేది ఇచ్చింది అనే చెప్పాలి.

Advertisement

 

ఇక ఈ సినిమా అనేది విడుదల కాకముందే బింబిసార సీక్వెల్ అనేది ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాను కూడా అదే విధంగా ముగించి.. హిట్ కావడంతో బింబిసార2 ఉంటుంది అనే విషయాన్ని చెప్పేసింది చితబృందం. అయితే ఆ సీక్వెల్ అనేది ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సీక్వెల్ సినిమా కథ ఎలా ఉండబోతుంది అనే విషయంలో డైరెక్టర్ వశిష్ట ఓ హింద్ ఇచ్చాడు.

Advertisement

అయితే మాములుగా బింబిసార అనే రాజు చాలా రాజ్యాలను హస్తగతం చేసుకున్నాడు అని తెలుస్తుంది. కానీ ఈ మొదటి సినిమాలో ఆ విషయాన్ని చూపించలేదు. కేవలం ఆయన ఒక్క యుద్ధం చేయడం మాత్రమే చూపించారు. కాబట్టి ఆ రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకోవడం సీక్వెల్ లో చూపించనున్నట్లు డైరెక్టర్ వశిష్ట ఓ హింట్ ఇచ్చాడు. అయితే ఈ బింబిసార౨నే సినిమా ఎప్పటికి విడుదల అనేది అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :  టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ధావన్ కామెంట్స్..!

కామన్వెల్త్ లో మెడల్స్ సాధించిన క్రికెటర్ల భార్యలు వీళ్ళే..!

Visitors Are Also Reading