Home » ఖలేజా మూవీ సీన్ ని నమ్రతతో రీ క్రియేట్ చేసిన మహేష్.. సోషల్ మీడియాలో వైరల్..!

ఖలేజా మూవీ సీన్ ని నమ్రతతో రీ క్రియేట్ చేసిన మహేష్.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Published: Last Updated on

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మహేష్ బాబు బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తో చాలా సినిమాల్లో నటించారు మహేష్ బాబు.  రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఖలేజా మూవీ థియేటర్ లో ఎలా ఫ్లాప్ అయ్యిందో .. ఇప్పటికి అర్ధం కావడం లేదు. ఏ రేంజ్ హిట్ సార్ అది.. ఇప్పుడు వెతుక్కొని మరీ చూస్తున్నారు.

ఖలేజా మూవీ సీన్‌ని భార్య నమ్రతతో కలిసి రీ క్రియేట్ చేశారు మహేష్ బాబు. సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ  వైరల్ అవుతోంది.  సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ ఉంటున్నారు. గుంటూరు కారం  ప్రమోషన్ ఇలా చేస్తున్నారో ఏమో కాని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చిన్న చిన్న విషయాలన్నీ భలే షేర్ చేసుకుంటున్నారుమహేష్ తాజాగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ.. ఓ పిక్ షేర్ చేశారు. ఆ ఫొటోలో మహేష్, నమ్రతని ప్రేమతో కౌగిలించుకొని ముద్దాడుతున్నారు. ఇక ఈ పిక్‌ చూసిన నెటిజెన్స్.. ఓ విషయాన్ని కనిపెట్టారు. ఖలేజా సినిమాలోని ఓ సీన్ ని మహేష్ బాబు రీ క్రియేట్ చేశారని చెబుతున్నారు. పెద్ద సీన్ కాకపోయినా అనుష్క ప్లేస్ లో నమ్రత ను కిస్ చేస్తున్న ఫొటో షేర్ చేశారు.


ఆ సీన్ లో మహేష్, అనుష్క స్టిల్, ఇప్పుడు నమ్రతతో మహేష్ షేర్ చేసిన స్టిల్ కూడా ఇంచుమించు అలానే ఉంది. దీంతో మహేష్ అభిమానులు.. ఖలేజా ఫొటోతో ఈ పిక్ ని జత చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాగా మహేష్ బాబు ఓ యాడ్ షూట్ కోసం రీసెంట్ గా దుబాయ్ వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కూడా అక్కడే చేసుకోవడానికి ఫ్యామిలీని కూడా తీసుకు వెళ్లారు. ఈ పిక్ దుబాయ్‌లోనిదే. కాని న్యూయర్ సెలబ్రేషన్స్ లో బాగంగా ఈ పిక్ ను షేర్ చేయడం లో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసిది. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే.. రీసెంట్ గా రిలీజ్ చేసిన కుర్చీ మడత పెట్టి సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేస్తోంది. జనవరి 12న రిలీజ్ కాబోతుంది. సినిమా కలక్షన్స్ కోసం మాట్లాడుకుందాం.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading