Home » శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌.. బ‌ర్త్ డే రోజున స‌ర్‌ప్రైజ్‌..!

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌.. బ‌ర్త్ డే రోజున స‌ర్‌ప్రైజ్‌..!

by Anji
Ad

ఆర్ఆర్ఆర్ విజ‌యంతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో అభిమానుల‌ను సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇప్పుడు మ‌రొక రెండు ప్రాజెక్ట్‌ల‌ను ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్టీఆర్ 30 కి కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు కాగా.. ఎన్టీఆర్ 31కి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ రెండు సినిమాల‌ను అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌ల‌ను అభిమానుల‌కు ఇచ్చేందుకు ఆయా నిర్మాత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు.

మే 20న ఎన్టీఆర్ జ‌న్మ‌దినంసంద‌ర్భంగా రెండు సినిమాలు సంబంధించి అప్‌డేట్ రానున్న‌ట్టు స‌మాచారం. పుట్టిన‌రోజు కానుక‌గా.. అభిమానుల కోసం ఆ సినిమాల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కూడా కొన‌సాగుతుంది. జూన్‌లో ఎన్టీఆర్ 30, అక్టోబ‌ర్‌లో ఎన్టీఆర్ 31 చిత్రాలు సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో స్వ‌యంగా ఎన్టీఆర్ చెప్ప‌డం విశేషం.

Advertisement

Advertisement

అదేవిధంగా ద‌ర్శ‌కుడు శంక‌ర్‌-కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్‌కు స‌రిపోయే క‌థ‌ను శంక‌ర్ రెడీ చేసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్‌కు క‌థ వినిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ వీరిద్ధ‌రి కాంబినేష‌న్‌లో సినిమా సెట్ అయితే.. మ‌రొక రేంజ్ లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

Also Read :

తెలుగులో 24గంట‌ల్లోనే అత్య‌ధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 లిరిక‌ల్ వీడియోలు..!

తిరుప‌తి భ‌హిరంగ స‌భ‌లో ఎన్టీఆర్ పై కృష్ణ చేసిన ఘాటు విమ‌ర్శ‌లు…ఆ త‌ర‌వాత వైఎస్ఆర్ ఎమ‌న్నారంటే…!

Visitors Are Also Reading