టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు బాబు మాతృమూర్తి ఘట్టమనేని ఇందిరా దేవి ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో కన్నుమూశారు. ఇటీవలే ఆమె ఆరోగ్యం సీరియస్ కావడంతో గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చేర్పించి ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఇక మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూయడంతో అతని అభిమానులు విషాదంలో మునిగిపోయారు. స్టే స్ట్రాంగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా మహేష్ కు ధైర్యం చెబుతున్నారు.
1961లో సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. అయితే ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించిన విషయం విధితమే. కృష్ణ 1969లో విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. 2019లో విజయనిర్మల కూడా ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఇలా వరుస మరణాలు ఘట్టమనేని కుటుంబంలో విషాదాన్ని నింపాయి. ఒకే ఏడాదిలో మహేష్ బాబు కుటుంబంలో ఇద్దరు చనిపోవడం వారి కుటుంబంలో కోలుకోలేని దెబ్బ. 2022 జనవరి నెలలోనే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందాడు. ఆ సమయంలో మహేష్ బాబుకి కరోనా రావడంతో తన అన్న చివరి చూపును కూడా చూడలేకపోయాడు మహేష్ బాబు.
Advertisement
Advertisement
Also Read : ఆ ఒక్క కారణంతో మన్మథుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో !
ప్రస్తుతం తల్లి ఇందిరా దేవి మరణించడంతో కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. మహేష్ బాబు ఇందిరాదేవిని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వారు. ప్రధానంగా ఏ పండుగ వచ్చినా మహేష్ బాబు కుటుంబం అంతా ఇందిరా దేవి ఇంట్లో వాలిపోయేవారు. ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇందిరా దేవి పుట్టిన రోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్ బాబు. అమ్మ అంటే నాకు దేవుడితో సమానం అని, ఏ సినిమా విడుదలైన ఆమె ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. అది నాకు దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టు ఉండేది. ఆమె ఆశీస్సులు నాకు ముఖ్యం అని మహేష్ చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందడంతో ఇందిరా దేవి కృంగిపోయారు. రమేష్ జ్ఞాపకాల నుంచి తేరుకోలేకపోయారు.
Also Read : మహేష్ బాబుకి మాతృ వియోగం