Home » నేను నా భార్యను ఫాలో అవుతా : మహేష్ బాబు

నేను నా భార్యను ఫాలో అవుతా : మహేష్ బాబు

by Azhar
Ad
తెలుగులో టాప్ హీరోగా కొనసాగేవాళ్ళలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక్కడు. అయితే 2020 సంక్రాంతి కానుకగా… మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్ళకు మళ్ళీ మహేష్ నటించిన సర్కారు వారి పాట అనే సినిమా విడుదల అవుతుంది. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జంటగా కీర్తి సురేష్ నటించింది.
అయితే ఈ సినిమా రేపు విడుదల కానుండటంతో ప్రస్తుతం మహేష్ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక అదే విధంగా టాలీవుడ్ లోనే అందరికంటే ఎక్కువగా 12.5 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ను ట్విట్టర్ లో కలిగి ఉన్న మహేష్ బాబు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తన సినిమా ప్రమోషన్స్ ను చేస్తున్నారు. అందులో భాగంగానే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
అయితే మహేష్ ను ప్రశ్నను అడిగే అవకాశం రావడంతో ఫ్యాన్స్ బాగా ఉపయోగించుకున్నారు. అందులో ఒక్కరు మీ ఇంట్లో ఎవరు బాగా యాక్టివ్ అని ప్రశ్నించగా… తన కూతురు సితార అని సమాధానం ఇచ్చారు. అదే విధంగా మీరు ట్విట్టర్ లో ఎవరిని ఫాలో కావాలి అనుకుంటున్నారు అని అడిగితే… నా భార్య నమ్రతను కావాలి అనుకుంటున్నాను.. ఆమెకు ట్విట్టర్ ఉంటె బాగుండు అని సమాధానం ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading