Home » బిజినెస్ మ్యాన్ కు ప‌దేళ్లు…ఆ సీన్ చేసేందుకు న‌మ్ర‌త పర్మిష‌న్ తీసుకున్న మ‌హేశ్..!

బిజినెస్ మ్యాన్ కు ప‌దేళ్లు…ఆ సీన్ చేసేందుకు న‌మ్ర‌త పర్మిష‌న్ తీసుకున్న మ‌హేశ్..!

by AJAY
Published: Last Updated on
Ad

మ‌హేశ్ బాబు కెరీర్ బెస్ట్ సినిమాల్లో బిజినెస్ మ్యాన్ సినిమా కూడా ఒక‌టి. రామ్ గోపాల్ వ‌ర్మ కాన్సెప్ట్ తో పూరీ జ‌గ‌న్నాత్ మార్క్ తో ఈ సినిమా తెర‌కెక్కింది. బుల్లెట్స్ లాంటి డైలాగుల‌తో మ‌హేశ్ బాబు సినిమాలో త‌న యాక్ష‌న్ తో ఆక‌ట్టుకున్నారు. ఓ సాధార‌ణ యువ‌కుడు మాఫియా డాన్ ల‌ను ఎదిరిస్తూ ముంబైను ఏలేందుకు వెళ్లగా అక్క‌డ జ‌రిగిన క‌థే ఈ సినిమా. అంతే కాకుండా ఈ సినిమాను నిజ‌జీవిత గ్యాంగ్ స్ట‌ర్ జీవితచ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కించారు.

Advertisement

త‌మిళ‌నాడుకు చెందిన గ్యాంగ్ స్ట‌ర్ క‌థ ఆధారంగా సినిమాను తెర‌కెక్కించారు. ఇక ఈ సినిమాకు అన్నీ ప్ల‌స్ పాయింట్ లుగా నిలిచాయి. ఈ చిత్రానికి త‌మ‌న్ ఇచ్చిన స్వ‌రాలు శ్రోత‌ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలోని సార్ ఒస్తారా సాంగ్ ఊపేసింది. ఈ సినిమా త‌ర‌వాత‌నే త‌మ‌న్ ను అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయి. ఇక సినిమాలో హీరోయిన్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించగా మ‌హేశ్ బాబుతో కాజ‌ల్ కెమిస్ట్రీ కూడా వ‌ర్కౌట్ అయ్యింది.

Advertisement

 

వీరిద్ద‌రి మ‌ధ్య ఉంటే ల‌వ్ రొమాంటిక్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కాజ‌ల్ తో మ‌హేశ్ బాబు లిప్ లాక్ స‌న్నివేశం ఒక‌టి ఉంటుంది. ఈ సీన్ థియేట‌ర్ల‌లో క్లాప్స్ కొట్టించింది. అయితే మ‌హేశ్ బాబు ఈ స‌న్నివేశం చేయ‌డానికి వెన‌డార‌ట‌. ఈ విషయాన్ని పూరీ జ‌గ‌న్నాత్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

అంతే కాకుండా ఈ సీన్ లో న‌టించేందుకు మ‌హేశ్ బాబు ముందుగా న‌మ్ర‌త ప‌ర్మిష‌న్ తీసుకున్న‌ట్టు కూడా పూరీ జ‌గ‌న్నాత్ తెలిపారు. ఇక అందుకే మ‌రి మ‌హేశ్ బాబుకు ఫ్యామిలీ మ్యాన్ అని బిరుదు వ‌చ్చింది. మ‌హేశ్ బాబు ముందు నుండి సినిమాల‌కు ఎంత టైమ్ ఇస్తాడో అంతే టైమ్ సినిమాల‌కు కూడా ఇస్తుంటాడు. ఇక న‌మ్ర‌త కూడా మ‌హేశ్ బాబును ఎంతో కేర్ గా చూసుకుంటుంది.

Also Read: కొడుకుల పెళ్లిళ్ల‌ కోసం నాగార్జున బిగ్ ప్లాన్.. అఖిల్ కు ఆ అమ్మాయి ఫిక్స్..!

Visitors Are Also Reading