Home » కొడుకుల పెళ్లిళ్ల‌ కోసం నాగార్జున బిగ్ ప్లాన్.. అఖిల్ కు ఆ అమ్మాయి ఫిక్స్..!

కొడుకుల పెళ్లిళ్ల‌ కోసం నాగార్జున బిగ్ ప్లాన్.. అఖిల్ కు ఆ అమ్మాయి ఫిక్స్..!

by AJAY
Ad

అక్కినేని హీరోల‌కు మొద‌టి పెళ్లి వ‌చ్చీ రాద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నాగార్జున కు రెండు పెళ్లిళ్లు జ‌ర‌గ్గా ఆయ‌న అల్లుడు సుమంత్ కు మొద‌టి భార్య‌తో విడాకులు అయ్యాయి. అంతే కాకుండా నాగ చైత‌న్య స‌మంత‌ల పెళ్లి ఇటీవ‌లే పెటాకులు అయిన సంగ‌తి తెలిసిందే. ఇక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త‌లోనే అఖిల్ తాను ఓ అమ్మాయిని ప్రేమించి అంద‌ర్నీ షాక్ కు గురిచేశాడు.

Advertisement

అంతే కాకుండా త‌న పెళ్లికి కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఒప్పించాడు. ఇక ఆ పెళ్లి కాస్తా జ‌ర‌క్కుండానే క్యాన్సిల్ అయ్యింది. ఇదిలా ఉంటే నాగార్జున ఇప్ప‌టి వ‌ర‌కూ అఖిల్ కు మాత్ర‌మే పెళ్లి చేయాల‌నే బాధ్య‌త ఉండేది కానీ రీసెంట్ గా చైతూ కూడా స‌మంతతో విడిపోవ‌డంతో అత‌డికి కూడా సంబంధం వెత‌కాల్సిన ప‌ని ప‌డింది. దాంతో నాగార్జున కూడా ఇద్ద‌రు కొడుకుల పెళ్లి చేసేందుకు బిగ్ ప్లాన్ లో ఉన్నార‌ట‌.

Advertisement

అంతే కాకుండా అఖిల్ కు ఇప్ప‌టికే సంబంధం కూడా చూశార‌ట‌. నాగ చైత‌న్య ఇండ‌స్ట్రీకి చెందిన సమంత‌ను పెళ్లి చేసుకుని విడిపోవ‌డంతో మ‌ళ్లీ అలా జ‌ర‌గ‌కుండా నాగార్జున జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌. అందుకోస‌మే అఖిల్ కు ఇండ‌స్ట్రీ నుండి కాకుండా భ‌య‌ట సంబంధం చూశార‌ట‌. మ‌రోవైపు భారీ ఆస్తి పాస్తులు ఉన్న సంబంధం కూడా కాద‌ట‌.

ALSO READ : Pawan Kalyan: పవన్ , భార్య నలుగురు పిలల్లలున్న ఫోటో వైరల్ చూసారా ?

అయితే చైతూ స‌మంత‌లు విడాకుల కోసం అప్లై చేసుకున్న‌ప్ప‌టికీ ఇంకా అప్రూవ్ అవ్వ‌లేదు. దాంతో చైత‌న్య విడాకులు వ‌చ్చిన త‌ర‌వాత అఖిల్ పెళ్లి చేస్తార‌ట‌. ఆ త‌ర‌వాత నాగచైత‌న్య కోసం అమ్మాయిని వెతుకుతార‌ని టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading