Home » ఎన్టీఆర్ తరువాత అంతటి ఘనతను సాధించిన ఏకైక సూపర్ స్టార్ మహేష్ ఒక్కరే !

ఎన్టీఆర్ తరువాత అంతటి ఘనతను సాధించిన ఏకైక సూపర్ స్టార్ మహేష్ ఒక్కరే !

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మ‌హేశ్ బాబు. చిన్న‌త‌నంలో మ‌హేశ్ బాబు కృష్ణ సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించారు. కృష్ణ కుమారుడిగా ర‌మేష్ బాబు కూడా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ హీరోగా రానించ‌లేక‌పోయారు. కానీ మ‌హేశ్‌బాబు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుని తండ్రి టాగ్ లైన్ సూప‌ర్ స్టార్ ను కూడా సొంతం చేసుకున్నారు.

Advertisement

మ‌హేశ్ బాబు కేవ‌లం మాస్ పాత్ర‌లే కాకుండా క్లాస్ పాత్ర‌ల‌ను కూడా చేస్తూ ఆకట్టుకుంటారు. టాలీవుడ్ లో మ‌రికొంద‌రు స్టార్స్ ఉన్నా మహేశ్ బాబుకు మాత్రం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనే పోటీ క‌నిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ వ‌ద్ద ప‌వ‌న్ మ‌హేశ్ ల వార్ మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఇక ఇండ‌స్ట్రీలోని స్టార్ హీరోల‌లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీరిద్ద‌రికే. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరోల‌లో ఎవ‌రూ సాధించ‌లేని ఓ అరుదైన రికార్డును మ‌హేశ్ బాబు సాధించారు.

Advertisement

Mahesh babu

Mahesh babu

అది కూడా ఒక‌ప్పుడు అన్న‌గారు ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డు. అప్ప‌ట్లో అన్న‌గారు ఎన్టీరామారావు త‌న న‌ట‌న‌కు, సినిమాల‌కు గానూ మొత్తం 57 అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ జ‌న‌రేష‌న్ లో యంగ్ హీరోల‌లో ఎక్కువ అవార్డుల‌ను సొంతం చేసుకుని మ‌హేశ్ బాబు ప్ర‌త్య‌క గుర్తింపు తెచ్చుకున్నారు.

మ‌హేశ్ బాబు ఇప్ప‌టి వ‌ర‌కూ ఏకంగా 37 అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. మ‌రికొన్ని అవార్డుల‌ను సంపాదించుకునేందుకు న‌ట ప్ర‌స్థానం కొన‌సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా నుండి పోస్టర్ మ‌రియు పాట‌లు విడుద‌ల కాగా ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ALSO READ :

చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో పోటీ ఉందా..? ప్ర‌భాస్ ఆన్స‌ర్ ఇదే…!

గాడ్ ఫాద‌ర్ సినిమాలో క‌థ‌ను మలుపుతిప్పే పాత్ర‌లో పూరిజ‌గ‌న్నాత్…పాత్ర ఏంటంటే…!

 

Visitors Are Also Reading