Home » గాడ్ ఫాద‌ర్ సినిమాలో క‌థ‌ను మలుపుతిప్పే పాత్ర‌లో పూరిజ‌గ‌న్నాత్…పాత్ర ఏంటంటే…!

గాడ్ ఫాద‌ర్ సినిమాలో క‌థ‌ను మలుపుతిప్పే పాత్ర‌లో పూరిజ‌గ‌న్నాత్…పాత్ర ఏంటంటే…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగానే మెగాస్టార్ ప్రస్తుతం గాడ్ ఫాద‌ర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసీఫ‌ర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతోంది.

Advertisement

ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పలువురు ప్రముఖులు న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు టాలెంటెడ్ హీరో సత్యదేవ్, యాంకర్ అనసూయ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

god father1

Advertisement

ఇదిలా ఉంటే రీసెంట్ గా పూరి జగన్నాథ్ కూడా సినిమాలో నటిస్తున్నట్లు మెగాస్టార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూరి జగన్నాథ్ పాత్ర ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. మలయాళ వర్షన్ లో జర్నలిస్ట్ పాత్ర‌కు తెలుగు లో ఎవరు చేస్తారు అన్న ప్రశ్న మొదలవగా పూరి జగన్నాథ్ ను సంప్రదిస్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

god father

god father

ఇక సినిమాలో చిరంజీవి చెల్లెలు గా న‌య‌న‌తార న‌టిస్తుండా ఆమె భ‌ర్త‌గా స‌త్య‌దేవ్ న‌టిస్తున్నాడు. ఇక సినిమాలో పూరి జగన్నాథ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర కాగా ఆయ‌న‌ పనిచేస్తున్న ఛానల్ కు అధినేతగా అన‌సూయ‌ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మ‌రి డైరెక్ట‌ర్ గా స‌క్సెస్ అయిన పూరిజ‌గ‌న్నాత్ కు ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని ఇస్తుందో చూడాలి.

ALSO READ :

మాతృదేవోభ‌వ సినిమా చూసి థియేట‌ర్లో త‌నికెళ్ల‌భర‌ణిని పొడిచేయాల‌నుకున్నార‌ట‌..!

ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?

 

Visitors Are Also Reading