Home » మహేష్‌ బాబు త‌న కెరీర్‌లో కేవ‌లం ఒక్క సినిమాకి మాత్ర‌మే మేక‌ప్ వేసుకోలేదు.. అది ఏ సినిమానో తెలుసా ?

మహేష్‌ బాబు త‌న కెరీర్‌లో కేవ‌లం ఒక్క సినిమాకి మాత్ర‌మే మేక‌ప్ వేసుకోలేదు.. అది ఏ సినిమానో తెలుసా ?

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మంచి హిట్స్ తో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటూ అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్ గా రెండో షెడ్యూల్ విషయంలో కొత్త అప్ డేట్ వచ్చింది. రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ ప్రత్యేక సెట్ లో షూటింగ్ జ‌రుగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట.

Also Read : త‌న‌కంటే 7ఏళ్లు చిన్న‌వాడిని పెళ్లాడిన బాల‌య్య హీరోయిన్..? ఆమె భ‌ర్త ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.!

Advertisement

Manam

Advertisement

సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఇది పూర్తయిన త‌రువాత ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళితో ప్రతిష్టాత్మకమైన సినిమాని తీయడానికి రెడీగా ఉన్నాడు. ఈ సమయంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఇన్నాళ్ళ తన కెరీర్ లో ఎన్నో హిట్లు, ప్లాప్ లు రుచి చూశాడు. అయితే మహేష్ బాబు ఇప్పటివరకు మేకప్ లేకుండా చేసిన ఒకే ఒక్క సినిమా నిజం. మహేష్ బాబు నిజం సినిమాలో నేచురల్ కోసం మేకప్ అస్సలు టచ్ చేయలేదట. అందుకే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ అంద‌రినీ ఆకట్టుకున్నాయి.

Also Read : ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోనున్న విశాల్.. ఇంతకి ఆమె ఎవరంటే ?

Manam

నిజం సినిమా కోసం నిజాయితీగా పోరాడిన ఓ కుర్రాడిగా మహేష్ బాబు అందరి మనసులను దోచుకున్నాడు. ఈ సినిమా మహేష్ అభిమానులకు చాలా బాగా నచ్చింది. నిజం కోసం మహేష్ బాబుకు తేజ భారీ రెమ్యూనరేషన్ ఇప్పించార‌ట‌. అప్పటికే ఒక్కడు సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. బాబి సినిమాకి రూ. 40 లక్షల వరకు తీసుకున్నాడ‌ట మ‌హేష్ బాబు. కానీ నిజం సినిమాకి రూ.1 కోటి ఇరవై లక్షలు ఇప్పించాను అంటూ మహేష్ బాబు రెమ్యూనరేషన్ గురించి నిజం చెప్పేశాడు తేజ.

Also Read : వెంకటేష్ పక్కన పెట్టిన సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగార్జున…ఆ సినిమా ఏదంటే…?

 

Visitors Are Also Reading