Home » వెంకటేష్ పక్కన పెట్టిన సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగార్జున…ఆ సినిమా ఏదంటే…?

వెంకటేష్ పక్కన పెట్టిన సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగార్జున…ఆ సినిమా ఏదంటే…?

by AJAY
Ad

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగార్జున. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో నాగార్జున టాలీవుడ్ లో అభిమానులను సంపాదించుకున్నారు. తండ్రి వారసత్వంగా నాగ్ వచ్చినప్పటికీ నటన మరియు అందంతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా నాగర్జున అన్ని రకాల పాత్రలలో నటించారు.

Advertisement

ఓవైపు రొమాంటిక్ సినిమాలతో మరోవైపు యాక్షన్ త్రిల్లర్ లతో…. ఇంకోవైపు భక్తి రస చిత్రాలతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ నాగార్జున తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా సినిమాలతో పాటు బిగ్ బాస్ లాంటి షోకు గత మూడు సీజన్ ల నుండి హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షోలో హోస్టుగా చేస్తూ ఎంతోమంది అభిమానులను తనవైపు తిప్పుకున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఒక హీరో పక్కన పెట్టిన కథతో మరో హీరో సినిమా చేసి హిట్టు కొట్టడం చాలాసార్లు జరిగింది. నాగ్ కెరీర్ లోనూ అలాంటి సినిమా ఒకటి ఉంది. నాగార్జున కెరీర్లోని సూపర్ హిట్ సినిమాల్లో సంతోషం కూడా ఒకటి.

ఈ సినిమాలోని కామెడీ మరియు ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ దశరథ్ సంతోషం సినిమా కథను మొదట వెంకీకి చెప్పాడట. కానీ వెంకటేష్ ఈ సినిమా కథ నచ్చకపోవడంతో పక్కన పెట్టేసాడు. ఇక అదే కథలో నాగార్జున హీరోగా నటించి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.

Visitors Are Also Reading