Home » ఆ స్టార్ ద‌ర్శ‌కునికి మ‌హేష్‌బాబు క్ష‌మాప‌ణ

ఆ స్టార్ ద‌ర్శ‌కునికి మ‌హేష్‌బాబు క్ష‌మాప‌ణ

by Anji

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ట‌. ఈ విష‌యాన్నీ ఇటీవ‌లే మ‌హేష్‌బాబు బాల‌య్య‌బాబు హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వ‌చ్చిన సంగ‌తి తెలిసిన‌దే. ఫిబ్ర‌వ‌రి 04న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ఈ షోలో బాల‌య్య మ‌హేష్ నుంచి గ‌ట్టి సీక్రెట్‌ల‌నే రాబ‌ట్టారు. ఆయ‌న పెళ్లి ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో జ‌రిగిన ఫ‌న్నీ ఇన్సిడెంట్ల వ‌ర‌కు అన్నింటినీ ఆయ‌న నోటి నుంచే చెప్పించారు. ఇక డైరెక్ట‌ర్ల ద్వారా కొన్ని సీక్రెట్ల‌ను రివీల్ చేయించి.. మ‌హేష్తో ఆ ఇన్సిడెంట్ ను ఫినిష్ చేయించారు. ఈ ఇన్సిడెంట్ల‌లో మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు క్ష‌మాప‌ణ‌లు ఎందుకు చెప్పాల్సి వ‌చ్చింద‌నేది చెప్ప‌మ‌ని కోరారు.

మ‌హేష్ ఈ విధంగా వివ‌రించారు. ఓసారి ముంబై మారిట‌న్ హోట‌ల్లో నేను ఫ్యామిలితో పాటు టిఫిన్ చేయ‌డానికీ వెళ్లాను. అక్క‌డ మ‌హేష్ వ‌చ్చాడ‌ని ఇద్ద‌రు అమ్మాయిలు సెల్పీ కోసం నా ద‌గ్గ‌రికీ వ‌చ్చారు. నేను ఫ్యామిలితో వ‌చ్చాను. ఇప్పుడు కాదు అని చెప్ప‌గానే వెళ్లిపోయారు. ఆ ఇద్ద‌రు అమ్మాయిలు ఎవ‌రో తెలుసా..? డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తెలు అని చెప్పారు. వెంట‌నే నేను ప‌రుగెత్తుకుంటూ వెళ్లి వారిని ఆపాను. సారీ స‌ర్ మీ అమ్మాయిలు అని తెలియ‌క అలా అన్నాను అని చెప్పాను. ప‌ర్లేదు హీరోలు అంటే ఎలా ఉంటారో వాళ్ల‌కు కూడా తెలియాలి క‌దా అని డైరెక్ట‌ర్ అన్నారని ఆ సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. బాల‌య్య‌-మ‌హేష్ ఫ‌న్ పుల్ ఎపిసోడ్ ను మీరు కూడా లుక్కెయండి.

Also Read :  టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

Visitors Are Also Reading