Home » మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..నటి మహాలక్ష్మి సంచలన వ్యాఖ్యలు

మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..నటి మహాలక్ష్మి సంచలన వ్యాఖ్యలు

by Bunty

బుల్లితెర నటి మహాలక్ష్మి రవీందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ గత సంవత్సరం వివాహం చేసుకున్నారు. ఇక వివాహమైన అనంతరం వీరిద్దరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. డబ్బుల కోసమే మహాలక్ష్మి రవీందర్ ను వివాహం చేసుకుందని, ఇతనితో విడాకులు తీసుకుంటుందని ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

Tamil producer Ravindar Chandrasekaran arrested for cheating of Rs 16 crore

Tamil producer Ravindar Chandrasekaran arrested for cheating of Rs 16 crore

మహాలక్ష్మి ఓ సీరియల్ నటి. రవీందర్ ప్రొడ్యూసర్. ఇక వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. మహాలక్ష్మికి రవీందర్ తో రెండవ వివాహం. అంతకుముందే మరొక వ్యక్తితో వివాహం జరిగి అతనితో విడాకులు తీసుకుంది. ఇక సీరియల్ లో నటిస్తున్న సమయంలో రవీందర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వివాహా అనంతరం వీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నప్పటికీ వీరి మీద ఏదో ఒక వార్త వైరల్ చేస్తూనే ఉంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో రవీందర్ ఒక వ్యక్తినీ మోసం చేసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఆ వ్యక్తి వద్ద ఏకంగా 15 కోట్ల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనని మోసం చేశాడని, ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో రవీందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి తన భర్త అరెస్ట్ విషయంలో స్పందిస్తూ… నేను మోసపోయానంటూ చెప్పుకొచ్చింది. రవీందర్ తన అప్పులు, ఆర్థిక లావాదేవీల గురించి నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి వివాహం చేసుకున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading