నటి వాసుకి అంటే ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ తొలిప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించిన అమ్మాయి అంటే టక్కున గుర్తుపడతారు. పవర్ స్టార్ కెరియర్ లోని క్లాసిక్ మూవీ గా గుర్తింపు పొందిన తొలిప్రేమ చిత్రంలో హీరో సోదరి పాత్రలో ఆ వాసుకి మంచి గుర్తింపు సాధించుకుంది. కానీ ఆమె ఈ ఒక్క చిత్రానికి మాత్రమే పరితమైంది. అలాంటి వాసుకి తన లవ్ స్టోరీ గురించి ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది. తొలిప్రేమ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ స్నేహితుడైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో ప్రేమలో పడిందట. ఈ క్రమంలో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది.
also read:విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?
Advertisement
ఒక ఐటీ కంపెనీలో పని చేస్తూ తన ఇద్దరు పిల్లలు ఆలనా పాలన చూసుకుంటుంది. దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత వాసుకి మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చింది. సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె శుభశకునంలో అనే చిత్రంలో ఈమె నటించింది. అయితే ఆనంద్ సాయి చాలా తక్కువగా మాట్లాడతారని, ఎంత కలుపుకొని మాట్లాడదామన్న సైలెంట్ గా ఉంటారని చెప్పుకొచ్చింది. అలా తొలిప్రేమ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ గానే కొనసాగామని అలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నామని తెలియజేసింది.
Advertisement
also read:సీక్రెట్ మ్యారేజ్ గురించి ఆ బాలీవుడ్ బ్యూటీ ఏమందో తెలుసా ?
8 నెలలు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఎలాంటి ప్రపోజ్ చేయకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడిగారని, కానీ నేను ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పానని, దీంతో ఆయన కొన్నాళ్లు మాట్లాడకుండా ఉన్నారని అన్నది. అలా చివరికి నేనే ఆలోచించుకొని డైరెక్ట్ పెళ్ళికి ఒప్పేసుకున్నానని ఆ విధంగా మా లవ్ స్టోరీ మొదలై పెళ్లితో ఎండ్ అయిందని , ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటున్నామని తెలియజేసింది. పవన్ కళ్యాణ్ తో మళ్లీ ఎప్పుడైనా మీట్ అయ్యారా అని యాంకర్ అడగ్గా మా పనుల వల్ల చాలా బిజీగా ఉంటామని, ఇక పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారని కనిపిస్తే తప్పకుండా మాట్లాడతారని అన్నది.
also read:మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం