Home » ఈ ఇంటి చిట్కాలతో బరువు తగ్గడం చాలా ఈజీ..!

ఈ ఇంటి చిట్కాలతో బరువు తగ్గడం చాలా ఈజీ..!

by Anji
Ad

సాధారణంగా ఈరోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ చాలా ఈజీగా బరువు తగ్గే మార్గం మీ కిచెన్ షెల్ప్ లోనే ఉందనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని వంటకాల్లో వినియోగించే సుగంధ ద్రవ్యాలలో పసుపు ఒకటి. పసుపులోయాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. పసుపు బరువు తగ్గడంలో సహాయపడుతుందంటే మీరు నమ్మలేరు. కానీ ఇది వాస్తవం అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పసుపు తీసుకోవడం చాలా మంచిది. డయాబెటిస్ ముప్పు ఉంటుంది. పసుపు ఉపయోగించడం వల్ల డయాబెటిస్ కి చెక్ పెట్టడమే కాకుండా.. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపులో ఉండే ఫెనోల్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఒబెసిటీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వైట్ ఎడిపోజ్ టిష్యూలో వాపు తగ్గించేందుకు పని చేస్తాయి.

Advertisement

పసుపు పాలు :

Manam News

పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గుకు వ్యతిరేకంగా మీ రోగ నిరోధకశక్తిని బలపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. 

అల్లంతో పసుపు టీ :

Turmeric Tea Benefits: 'పసుపు టీ'తో బోలెడు ఉపయోగాలు.. దీని గురించి తెలిస్తే  అస్సలు వదిలిపెట్టరు | Turmeric tea do not forget to add this additional  spice to your haldi ki chai for maximum ...

Advertisement

యాంటీ ఆక్సిడెంట్లు, మూలికల గొప్ప మూలం, అల్లం బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తరిగిన అల్లం వేసి వేడి నీటిని మరిగించాలి. ఆ తరువాత అందులో కాస్త పసుపు వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఈ పానీయం వడకట్టవచ్చు. లేదంటే అలాగే తాగేయవచ్చు. దీనిని రోజూ తాగడంతో బరువు తగ్గుతారు. అల్లం ఆకలిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.  

Also Read :   చర్మ క్యాన్సర్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందో తెలుసా ? 

తేనెతో పసుపు టీ :

Manam News

తేనెతో పసుపు టీ బరువు తగ్గించేందుకు సహాయపడే ఓ అద్భుతమైన పానీయం. తేనె ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.  

Also Read :  ఈ పండు తింటే మధుమేహం అదుపులో ఉండడం పక్కా..!

దాల్చిన చెక్కతో పసుపు టీ :

Manam News

 

దాల్చిన చెక్క బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. పసుపు టీ లో కొంచెం దాల్చిన చెక్కను జోడించి తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 

 Also Read :  తల్లి కాబోతున్న మరో నటి.. అభిమానులు శుభాకాంక్షలు..!

Visitors Are Also Reading