Home » అల్లు అర్జున్ హుక్ స్టెప్ ను రీక్రియేట్ చేసిన చిన్నారి వీడియో వైర‌ల్

అల్లు అర్జున్ హుక్ స్టెప్ ను రీక్రియేట్ చేసిన చిన్నారి వీడియో వైర‌ల్

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, ర‌ష్మిక మంద‌న్న హీరో, హీరోయిన్లుగా న‌టించిన పుష్ప ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెల‌బ్రిటీలతో స‌హా అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. తెలుగు వారు మాత్ర‌మే కాదు. దేశ విదేశాల్లోని యూత్ సాంగ్స్‌ను అనుక‌రిస్తూ.. వీడియోలు షేర్ చేస్తున్నారు. చిన్న‌, పెద్ద ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా ఈ సినిమాలోని స‌న్నివేశాల‌ను ఇమిటేట్ చేస్తూ.. ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Advertisement

దీంతో ఈ సినిమాపై ఉన్న క్రైజ్ ఇప్ప‌ట్లో త‌గ్గే అవ‌కాశం లేదంటూ స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీ‌వ‌ల్లి ఛాలెంజ్ నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. ఈ ఛాలెంజ్ చిన్నారుల నుంచి పెద్దల వ‌ర‌కు అంర‌దూ పాల్గొంటారు. ఇప్పుడు శ్రీ‌వ‌ల్లి పాట‌కు అల్లుఅర్జున్ స్టెప్పుల‌ను అనుక‌రిస్తున్న ఓ చిన్నారి వీడియో వైర‌ల్‌గా మారిన‌ది.

Advertisement

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో ఆ చిన్నారి అల్లుఅర్జున్ హుస్టెప్‌ను రీ క్రియేట్ చేస్తున్న‌ది. ఆచిన్నారి అల్లుఅర్జున్ లా సేమ్ గీతల ష‌ర్ట్ అదే రంగు ప్యాంట్‌ను ధ‌రించి ఎల్‌సీడీ టెలివిజ‌న్‌లో ప్లే అవుతున్న శ్రీ‌వ‌ల్లి పాట‌ను అల్లు అర్జున్‌ను అనుక‌రిస్తూ.. డ్యాన్స్ చేసింది. ఆ చిన్నారి డ్యాన్స్ ఫీలింగ్స్ నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

Also Read :  వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…!

Visitors Are Also Reading