మెగాస్టార్ చిరంజీవి 2002లో విడుదలైన ఇంద్ర సినిమా ఎంతటి సంచలన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంద్ర సినిమా హిట్ అయిన తరువాత సరిగ్గా 63వ రోజు అనగా సెప్టెంబర్ 25, 2002న బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా విడుదలైంది. వి వి వినాయక్ దర్శకత్వం అందించగా.. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు డైలాగ్స్ స్క్రీన్ ప్లే రచించారు. ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. రెండు నెలల గ్యాప్ తో విడుదలైన చెన్నకేశవరెడ్డి సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయింది. రీ రిలీజ్ ను అభిమానులు పండగలా ఈ సినిమాను చూస్తున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు.
అయితే 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా థియేటర్ల లో అభిమానులు చూసినప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విధంగా ఆడక పోవడానికి కారణం మిస్ అయినా లాజిక్ లు. 22 ఏళ్లా..! అని చూసే వాళ్ళు ఫీలవ్వాలో లేక అయ్యో పాపం అని జాలి పడాలో లేక ఏదో నెంబర్ కోసం చేసినట్లు ఉంటుంది. బాలయ్య 22 ఏళ్ల పాటు జైలులో ఉండటం అనేది నమ్మేలా అనిపించదు. భార్య పాత్రలో నటించిన టబు లాజిక్ ప్రకారం.. భర్త చనిపోయాడా..? లేదా అని ఆరా తీయాలి. ఎందుకు పట్టించుకోలేదు. ఐలులో వెళ్లిపోయిన తరువాత చనిపోయాడని ఎలా ఫిక్స్ అవుతుంది. బతికే ఉన్నాడా.? లేదా? అని ఆరా తీయ్యలేదా.. తెలియాలి కదా..?అయినా కొడుకు చదివి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు కదా, తండ్రి పేరు అయినా సర్టిఫికెట్ లో రాయాలి కదా..అమ్మ నాన్న ఏమయ్యాడు అని కొడుకు అడగను లేదు తల్లి చెప్పలేదు. తల్లికైనా కొడుకు పోలీస్ ఆఫీసర్ కదా తండ్రి గురించి కనుక్కొని ఆరా తీయాలి. బ్రతికి ఉన్నాడా లేడా అని కనుక్కోరా అని ఏడుస్తూ చెప్పిన కొడుకు పట్టించుకోడా.. ? కానీ అది ఈ సినిమాలో జరుగలేదు. తెలిసిన తర్వాత అయినా నాన్న 22 ఏళ్లు జైల్లో ఉండటం ఏంటి అసలు ఏం జరిగింది అని కొడుకు కూడా ఆరా తీయడు.
Advertisement
బాలయ్య అయినా సరే నేనేం తప్పు చేశాను నా నేరమేంటి నన్ను ఎందుకు జైల్లో పెట్టారు జైల్లో ఉన్న అధికారులను మొర పెట్టుకోరా బయటకు వచ్చేందుకు ఏ ప్రయత్నం చేయరా ఇది సినిమాలో మిస్సయిన లాజిక్. ముఖ్యంగా ఈ సినిమాను చూడాలనిపించేది అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ డైలాగులకు తగ్గట్టుగా వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఫ్లాష్ బ్లాక్ లో కొన్ని డైలాగు లైన చూపించి ఉంటే అన్న కోసం భర్తనే చంపేసి రావడానికి కాస్త స్పేస్ దొరికేది. అది మిస్ అయింది ఇక బాలయ్య అరిస్తేనే గుండె ఆగిపోవడాలు. భర్త నిజమని నమ్మడం అని భార్య ఆత్మహత్య చేసుకోవడం అనేది ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. ఏ సినిమా హిట్ అవ్వకపోయినా దానికి రెండవ కారణం కథలో దమ్ము లేకపోవడం. బాలయ్య ని పెట్టుకుని రెండు క్యారెక్టర్లు క్రియేట్ చేసి ఒక మంచి కథను అల్లుకున్నాను అని వి.వి.వినాయక్ అనుకున్నాడు. కానీ ఆ కథలో దమ్ము లేదని అసలు గుర్తించలేకపోయాడు. కేవలం ఎలివేషన్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం మాత్రమే బ్లండర్ మిస్టేక్ ఇది.
బాలయ్యను ఇలా చూపించాలి అలా చూపించాలి గతంలో ఎవరూ చూపించని అంటూ బీభత్సమైన థింకింగ్ చేసిన వి వి వినాయక్ ఆ ఎలివేషన్స్ పరంగా సక్సెస్ అయ్యాడు కానీ కథ పైన ఫోకస్ పెట్టకపోవడం వల్ల అసలుకే మోసం వచ్చింది.బాలయ్య గత సినిమాలు చూసిన వారికి ఈ సినిమాను చూసిన వారికి అరే ఇలాంటివి ఎన్ని సినిమాలు లేవు సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు సినిమాలో ఇలాంటి కథ కథ చూపించింది అటు తిప్పి ఇటు తిప్పి అదే చూపించారే తప్ప కొత్తగా ఏముంది అని సాధారణ ఆడియన్స్ తేల్చేశారు. అందుకే ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. ఇక ఈ సినిమా హిట్ కాకపోవడానికి మూడవ కారణం ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ బాలయ్య సినిమా లో అందులో ఫ్యాక్షన్ సినిమాలు ఫ్లాష్ బ్యాకే సినిమాకు బ్లర్. సమరసింహా రెడ్డి సినిమా నుంచి బాలయ్య కెరీర్ లో బంపర్ హిట్ అయిన లెజెండ్ సినిమా ల వరకు ఫ్లాష్ బ్యాక్ అన్నది మూలస్తంభం. కానీ చెన్న కేశవ రెడ్డి సినిమాలో ఫ్లాష్ బ్యాకే దెబ్బకొట్టింది.
Advertisement
వాస్తవానికి ఈ సినిమాలో కొడుకుగా నటించిన బాలయ్య పాత్రలో పెద్దగా మెరుపులు ఉండవు. తండ్రి గా నటించిన బాలయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. వన్స్ తండ్రి బాలయ్యను చూసిన తరువాత బాలయ్యకి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి వామ్మో.. బీభత్సన ఫ్లాష్‌బాక్ ఉంటుందని అభిమానులు ఆశిస్తారు. కానీ తీరా చూస్తే ఫ్లాష్ బ్యాక్ తేలిపోయింది. ఒక ప్రత్యర్థి నేరుగా ఇంటికి వచ్చి నీ కూతురు ని పెళ్లి చేసుకుంటాను అని అడిగినంత మాత్రాన ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా అలాంటిది ఈ సినిమాలో ఆ తండ్రి అంటాడు.పెళ్లి లోనే చడి చప్పుడు కాకుండా కుటుంబం అందరిని లేపేస్తారు. హీరో ని కూడా అక్రమ కేసులో ఇరికించి 22 ఏళ్లు జైల్లో ఉండేలా చేస్తారు. అంతే ఇందులో హీరో ను ఎలివేట్ చేసే సీన్లు ఫ్లాష్ బ్యాక్ లో ఏమీ ఉండదు జైలు నుండి విడుదలయ్యాక బాలయ్య కు ఇచ్చిన ఎలివేషన్ రేంజ్ తగ్గట్టు లో ఫ్లాష్ బ్యాక్ లో అంతగా లేవు. కథలో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాంటివే ఈ సినిమాలో తెలుస్తోంది.
అందుకే ఈ సినిమా హిట్ అవ్వకపోవడం లో ఫ్లాష్ బ్యాక్ ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ సినిమా పెద్దగా ఆడకపోవడానికి ప్రధాన కారణం నాలుగవది హడావిడిగా రిలీజ్ చేయడం. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ అప్పటికే పూర్తి అవలేదు. ఓ పాట బ్యాలెన్స్ కూడా ఉంది. ఎందుకు చేశారో ఏమోగానీ హడావిడిగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇంద్ర సినిమా కు పోటీగా రిలీజ్ చేశారని చిరంజీవి ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఇంద్ర సినిమా రికార్డే గేయంగా చెన్నకేశవరెడ్డి సినిమా రిలీజ్ అయిందా అని మెగా ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఇంద్ర సినిమాలో థియేటర్లలో వందరోజులు సంఖ్య తగ్గించే కుట్రలో భాగంగానే చెన్నకేశవరెడ్డి సినిమా రిలీజ్ అయింది అని కూడా అంటారు. కారణాలు ఏమైతేనేం షూటింగ్ పూర్తి అవ్వకముందే హడావిడిగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఆ తరువాత కొద్ది రోజులకు తెలుపు తెలుపు అనే సాంగును చిత్రీకరించి ఆలస్యంగా సినిమా కు వచ్చేలా చేశారు. అప్పటికే చిరంజీవి సినిమా హిట్ జోష్ లో ఉంది. ఇంకా థియేటర్ లలో ఆడుతూ వుంది.
Also Read : “ప్రేమ కథ చిత్రం” హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?
చెన్నకేశవరెడ్డి సినిమా షూటింగు పూర్తి అయ్యేదాకా ఉండి ఇంద్ర సినిమా ఫీవర్ తగ్గే దాకా ఆగి ఆ సినిమా థియేటర్లలో మాయం అయ్యాక రిలీజ్ చేసి ఉంటే ఇంత సినిమాతో పోలిక వచ్చేదే కాదు. అరే ఈనతో పోలిస్తే అదేం బాగుందిరా అనే టాక్ వచ్చేదే కాదు. నిజానికి చెప్పాలంటే చెన్నకేశవరెడ్డి సినిమా లో బోర్ ఫీలయ్యే తలనొప్పి తెచ్చే సీన్లు అస్సలు ఉండవు. సాఫీగా సాగిపోయింది. కానీ ప్రధానంగా ఇంద్ర సినిమా తో పోలిక చేయడం దెబ్బతీసింది. రాంగ్ టైంలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో చెన్నకేశవరెడ్డి సినిమా చెప్పకనే చెప్పింది. ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడక పోవడానికి 5 వ ప్రధాన కారణం కొడుకు క్యారెక్టర్ చేసిన బాలయ్య పాత్రలో పెద్దగా పస లేదు. మినిస్టర్ గ్యాంగ్ కు వార్నింగ్ ఇవ్వడం, ర్యాగింగ్ కు తుప్పు వదిలించడం, ముంబై వీధుల్లో రౌడీలకు ముచ్చెమటలు పట్టించాడం ఇవి బాలయ్య చేసే పనులు. నిజాయితీ ఆఫీసర్ అని చూపించేందుకు ఈ సీన్లు చూపించారు. ఆ తర్వాత కన్నతండ్రి చేసే క్రైమ్ ల ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయడం, చివరకు తండ్రి బాటలోకే వచ్చేయడం ఇది ఆయన పాత్ర. నీతి, నిజాయితీ, సమర్థవంతమైన ఆఫీసర్ గా చూపించారు కరెక్టే. చివరకు అదే రేంజ్ లో వచ్చారా అంటే అదీ లేదు.
Also Read : ముగ్గురి మరణాలకు ఉన్న లింక్ ఒకటే.. ఘట్టమనేని ఫ్యాన్స్‌ని భయపెడుతున్న సెంటిమెంట్..!
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బాలయ్య ఎంట్రీ సీన్ ఒకటి మాత్రం బాగుంది. కానీ విలన్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం అనేది ఇంద్ర సినిమాలోని సీన్ ని గుర్తు తెచ్చింది. ఇదే సినిమాకు కాస్త మైనస్ అయింది. ఈ సినిమాలో పెళ్లి లో అందరినీ లేపేసే సీన్ ఉంటది కదా ఆ సందర్భంలో ఓ సీన్ లో ఏడాది వయసు ఉన్న చిన్న పిల్లాడు కూడా ఓ కత్తి పట్టుకొని వెళ్లి విలన్ కి చూపిస్తున్నట్టుగా ఓ సీన్ ఉంటుంది అది అతికే అని అన్నమాట. . ఇలా బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమా లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అతి అనిపించే సీన్లు కూడా ఉన్నాయి అయినప్పటికీ బాలయ్య కు ఈ సినిమా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయిన కూడా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాకు నీరాజనాలు పలికారు.బాలయ్య అభిమానులు ఈ సినిమా కూడా విందుభోజనం గా ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా రాంగ్ టైమ్‌లో సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమా హిట్ కాలేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : సింగర్ సునీత భర్త మీకు తెలుసా.. ?