Home » “ప్రేమ కథ చిత్రం” హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

“ప్రేమ కథ చిత్రం” హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో కొంత మంది నటులు ఒక్కసారిగా అలా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు.. అలా వారు ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ  తారసపడినప్పుడు వారి గురించి ప్రేక్షకులు చర్చించుకుంటారు. ఈ తరుణంలోనే సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది.. ఈ మూవీలో నందిత రాజ్ హీరోయిన్ గా నటించి తన నటనతో కళ్లతో అందరినీ భయపెట్టింది. ఈ సినిమాతో ఎంతో గుర్తింపు సాధించిన ఈ అమ్మడు అప్పట్లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది.

Advertisement

 

ALSO READSR.Ntr గారి సినిమా నుంచి మధ్యలోనే ఎందుకు చిరుని తీసేసారు !

కానీ ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాకు కూడా దూరం అయిపోయి కనీసం ఎవరికి కనబడని పరిస్థితిలో ఉంది. ఈ తరుణంలో నందిత రాజ్ గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరలవుతున్నాయి.అసలు ఆ హీరోయిన్ ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది?అనే విషయాన్ని చాలామంది ఆరా తీస్తున్నారు.. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు సినిమా ఛాన్స్ లు రాక సినిమా రంగంలో రాణించలేకపోయింది. అలాగే డేరింగ్ దర్శకుడు తేజ డైరెక్ట్ చేసిన నీకు నాకు డాష్ డాష్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఇందులో నందిత నటనకు మంచి పేరే వచ్చింది.

Advertisement

 

ఆ తర్వాత ప్రేమ కథా చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత మాత్రం ఆమెకు అనుకున్నన్ని ఆఫర్లు రాలేక సక్సెస్ కాలేదు. అయితే తాజాగా దర్శకుడు రాజా కిరణ్ డైరెక్షన్లో నటుడు సత్యం రాజేష్ కాంబినేషన్ లో వచ్చిన విశ్వామిత్ర సినిమాలో నటించినా అది అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈమె సినిమాలో సెలక్షన్ లో చేసే పొరపాట్ల వల్ల చాన్సులు రాకుండా పోవడంతో మళ్లీ మోడలింగ్ వైపు అడుగులు వేసింది.. ప్రస్తుతం ఈమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనే వివరాలు మాత్రం క్లారిటీ గా తెలియదు.. మనకు అందిన సమాచారం ప్రకారం ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది.. కానీ ఈమె కోసం ప్రస్తుతం నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading