Home » సంచ‌ల‌నం సృష్టిస్తున్న సిన‌త‌ల్లి ఎవ‌రు?…ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..!

సంచ‌ల‌నం సృష్టిస్తున్న సిన‌త‌ల్లి ఎవ‌రు?…ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..!

by AJAY
Ad

చిత్ర ప‌రిశ్ర‌మ అంటే రంగుల ప్ర‌పంచం. రంగుల ప్ర‌పంచంలో విహ‌రించాల‌ని ప్ర‌తిఒక్క‌రికీ ఉంటుంది. అలా రంగుల ప్ర‌పంచంలోకి వ‌చ్చి గుర్తింపు తెచ్చుకునేవారు మాత్రం చాలా త‌క్కువ మంది ఉంటారు. ముఖ్యంగా ఇక్క‌డ న‌ట‌న‌లో అన్ని ర‌సాలు పండించిన‌వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. ఇక ఈ యేడాది అలా త‌న న‌ట‌న‌తో ఎంతో మందిని క‌ట్టిప‌డేసిన న‌టి లిజ‌మొల్ జోస్….ఈ పేరుతో చెబితే పెద్ద‌గా తెలియ‌దు కానీ సిన‌త‌ల్లి అంటే మాత్రం గుర్తు ప‌ట్ట‌ని వారు ఉండ‌రు. జైభీమ్ సినిమాలో లిజ‌మొల్ జోస్ సిన‌త‌ల్లి అనే పాత్ర‌లో న‌టించింది.

Advertisement

ఈ సినిమాలో సూర్య హీరో అయితే సెకండ్ హీరో సిన‌త‌ల్లే అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుండి శుభం కార్డు ప‌డేంత వ‌ర‌కూ సిన‌త‌ల్లి పాత్ర‌కు స్కోప్ ఉంటుంది. అలా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లో న‌టించిన లిజ‌మోల్ జోస్ బోల్డ్ పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అలాంటి లిజ‌మోల్ జోస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం….లిజ‌మోల్ బోస్ పుట్టింది పెరిగింది కేర‌ళ‌లోనే….ఉన్న‌త మ‌ధ్య త‌ర‌గతి కుటుంబం నుండి లిజ‌యోల్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చింది.

Advertisement

లిజ‌యోల్ అమెరికాలో డిగ్రీ పూర్తి చేసి పాండిచ్చేరిలో పీజీ పూర్తి చేసింది. డిగ్రీ త‌ర‌వాత ఓ టీవీ ఛాన‌ల్ లో ప‌నిచేసింది. మొద‌ట‌గా ఫ‌హ‌ద్ ఫాజిల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది సిన‌త‌ల్లి. ఇటీవ‌లే అరుణ్ ఆంటోని అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం ఆరు సినిమాల్లో న‌టించగా సిద్దార్థ్ హీరోగా వ‌చ్చిన ఓరేయ్ బామ్మ‌ర్ది సినిమాలో న‌టించి మెప్పించింది.

ఈ సినిమాలో చూసే జ్ఞాన‌వేల్ లిజమోల్ కు జైభీమ్ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. ఇక జై భీమ్ సినిమాలో గ్లిజ‌రిన్ వాడ‌కుండానే తాను ఏడ్చేశాన‌ని చెప్పింది. ఈ సినిమా ఎప్పుడు చూసినా కూడా తాను ఏడ్చేస్తాన‌ని చెప్పింది. ఇక జైభీమ్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లిజ‌యోల్ కు ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

Visitors Are Also Reading