Home » లైగ‌ర్ సినిమా శాటిలైట్ కి ధ‌ర ఎంత ప‌లికిందో తెలుసా..?

లైగ‌ర్ సినిమా శాటిలైట్ కి ధ‌ర ఎంత ప‌లికిందో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జంట‌గా న‌టిస్తున్న చిత్రం లైగ‌ర్‌. ఈ సినిమా ఆగ‌స్టు 25న విడుద‌ల అవుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా లైగ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల అయింది. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న లైగ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల అయింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ని మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ మాస్ డైలాగ్స్‌, భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ తో అదిరిపోయిందంటున్నారు విజ‌య్ అభిమానులు. ఒక ల‌య‌న్‌కి, టైగ‌ర్‌కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ వాడంటూ సాగే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది.


ఈ చిత్రం ట్రైల‌ర్‌ను ప్యాన్ ఇండియా లెవ‌ల్‌లో తెలుగు, హిందీతో పాటు మిగ‌తా ఐదు భాష‌ల్లో మూవీ ట్రైల‌ర్ 24 గంట‌ల్లో యూట్యూబ్ లో 16 మిలియ‌న్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోల‌లో ఈ ట్రైల‌ర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది పూరిజ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ సినిమా రూపొందింది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ చిత్రానికి క‌ర‌ణ్ జొహార్ కూడా ఓ నిర్మాణ భాగ‌స్వామిగా ఉన్నాడు. ఈ చిత్రంలో విజ‌య్ బాక్స‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. విజ‌య్ యాక్ష‌న్‌, నెత్తిగా మాట్లాడ‌డం వంటివి ట్రైల‌ర్‌లో చూపించ‌డంతో మంచి రెస్పాన్స్ వ‌స్తంది.

Advertisement

Advertisement


ఈ సినిమాపై క్రేజ్ కార‌ణంగా లైగ‌ర్ శాటిలైట్ భారీ ధ‌ర‌కు ప‌లికిన‌ట్టు స‌మాచారం. లైగ‌ర్ శాటిలైట్ డిజిట‌ల్ రైట్ క‌లుపుకుని రూ.55కోట్లు ప‌లికిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంతో తెలుగు తెర‌కి అన‌న్య పాండే హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. లైగ‌ర్ హిట్ అయితే టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్‌లో కూడా అన‌న్య‌కు మంచి పేరు వ‌స్తుది. విజ‌య్ తండ్రి మైక్ టైస‌న్ బాట‌లో ప్ర‌పంచ బాక్సింగ్ ఛాంపియ‌న్ షిప్ విజేత‌గా నిల‌వాల‌నేదే లైగ‌ర్ స్టోరిలా క‌నిపిస్తుంది. లైగ‌ర్ ట్రైల‌ర్‌లో హీరో తల్లిగా ర‌మ్య‌కృష్ణ మాస్‌లుక్‌తో క‌నిపించ‌డం భారీ అంచ‌నాలు పెంచింది. మ‌రీ ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఆగ‌స్టు 25వర‌కు ఎదురు చూడాల్సిందే.

Also Read : 

చైతూను నిన్ను ఒకే గ‌దిలో ఉంచితే అంటూ ప్ర‌శ్నించిన క‌ర‌ణ్…? స‌మంత రిప్లై విని మైండ్ బ్లాక్..!

 

Visitors Are Also Reading