Home » వాహనాల కింద “నిమ్మకాయలను” పెట్టి ఎందుకు తొక్కిస్తారు…?

వాహనాల కింద “నిమ్మకాయలను” పెట్టి ఎందుకు తొక్కిస్తారు…?

by Bunty
Ad

 

ఎవరైనా కొత్త వాహనాలను కొంటే వారు మొదట చేసే పని నిమ్మకాయలను తొక్కించడం. ఈ పద్ధతి పూర్వకాలం నుంచి వస్తుంది. ఒకరిని చూసి మరొకరు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. బైకులు, కార్లు, ఇతర వాహనాలు ఏవి కొన్న మరుసటి రోజు వాహనానికి పూజ చేస్తారు. ఇక మన పూర్వకాలంలో వాహనాలు ఉండేవి కాదు. కానీ ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లు ఉండేవి.

READ ALSO : Balagam : తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న…

Advertisement

అప్పట్లో ప్రయాణాలు అన్నీ కూడా ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లతోనే సాగేవి. అయితే ఎడ్లు గాని, గుర్రాలు గాని ఎక్కువ దూరం నడవడంతో పాటు మరికొన్ని సందర్భాలలో వాటి కాళ్లకు గాయాలు అయ్యేవి. ఆ గాయాలతోనే బురదలో, మట్టిలో ఎడ్లు, గుర్రాలు నడిచేవి. దీంతో వాటికి ఆయిన గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి పురుగులు పట్టేది. దీంతో ఆ పుండ్లు ఇంకా పెద్దదిగా అయ్యేవి. అయితే ఆ పురుగులను నివారించడానికి, గాయాలను తగ్గించడానికి ఎడ్లతో, గుర్రాలతో నిమ్మకాయలను తొక్కించేవారు.

Advertisement

read also : మహిళల బ్లౌజులపై సింగర్ చిన్మయి వివాదాస్పద వాక్యాలు

వాహనాల కింద నిమ్మకాయలనుపెట్టి ఎందుకు తొక్కిస్తారు.. | Why Do You Put Lemons Under Vehicles And Trample,lemon,lemon Under Vehicles,lemon Trample,దోషం - Telugu Lemon, Lemon Trample, Lemon Vehicles

ఇలా చేయడం వల్ల నిమ్మకాయలలో ఉండే సిట్రిక్ యాసిడ్ పుండ్లలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. దీంతో గుర్రాలకు, ఎడ్లకు ఉన్న పుండ్లు త్వరగా తగ్గిపోతాయి. అందుకోసం నిమ్మకాయలను తొక్కించేవారు. అందుచేత పూర్వంలో ఎవరైనా ప్రయాణాలకు వెళుతుంటే నిమ్మకాయలను తొక్కించుకునేవారు. ఎడ్లకు, గుర్రాలకు తొక్కించాల్సిన నిమ్మకాయలను ఇప్పుడు రబ్బరు టైర్ల కింద తొక్కిస్తున్నారు. అయితే వాహనాల రబ్బరు టైర్ల కింద నిమ్మకాయలను తొక్కించడం వల్ల ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేదు.

Read Also : పైసల కోసం దిగజారిన రాశి కన్నా.. ఆ హీరోతో బెడ్ రూమ్ సీన్లకు…?

Visitors Are Also Reading