ఒకప్పుడు హీరోయన్ గా నటించిన లయ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అప్పట్లో వైవిద్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. లయ పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించింది. ముఖ్యంగా ఈ మధ్య లయ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్గా ఉంటుంది. అప్పుడప్పుడు రచ్చ కూడా చేస్తుంది. తెలుగు సినిమా పాటలకు చిందులేస్త తెగ హంగా సృష్టిస్తోంది. లయకు సంబంధించిన ఏ వీడియో అయిన ఇప్పుడు సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అవుతోంది.
Advertisement
ప్రస్తుతం లయకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ఆమె స్వస్థలం విజయవాడ. అక్కడ నలంద కళాశాలలో చదువుకున్నది. ఇక ఆ తరువాత టాలీవుడ్లో కొన్ని సినిమాలలో నటించింది. సినిమాలకు గుడ్ చెప్పిన తరువాత అమెరికాలో ఉండే ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. వివివి నాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 2002 లో చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చింది. ఈ చిత్రంలో శ్రీయ, టబు హీరోయిన్లుగా నటించారు. అయితే బాలయ్యకు సోదరిగా దేవయాని నటించింది. సోదరి పాత్ర కోసం తొలుత దర్శకుడు వినాయక్ హీరోయిన్ లయను కలిసి కథ వివరించాడట. అయితే బాలయ్యతో చెల్లి పాత్ర అనగానే లయ కాస్త అసహనం వ్యక్తం చేయడంతో పాటు బోరు విలపించిందట.
Advertisement
ఏమిటండి తెలుగు అమ్మాయిలను సిస్టర్ పాత్రలకే ఎక్కువగా ఎందుకు అడుగుతారు. హీరోయిన్గా పనికి రారా అని అన్నారట. దానికి మీరు చూడడానికి చాలా అమాయకంగా ఉంటారు. నేను అనుకున్న పాత్రకు మీరు కరెక్ట్ సూట్ అవుతారు అనిపించి వచ్చానని వినాయక్ చెప్పాడట. తెలుగు అమ్మాయిలను ఎందుకు అలా చూస్తారు..? హీరోయిన్ గా ఎందుకు ఛాన్స్ ఇవ్వరని కన్నీళ్లతో లయ ప్రశ్నించే సరికి నా దగ్గర మాత్రం సమాధానం లేదు. సారి అమ్మా ఏమి అనుకోకండి ప్లీజ్ అని చెప్పి వచ్చేసినట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు వినాయక్. చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు.
Also Read :
కళ్యాణ్ రామ్ నటించిన ఈ 3 సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?