Home » కళ్యాణ్ రామ్ నటించిన ఈ 3 సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?

కళ్యాణ్ రామ్ నటించిన ఈ 3 సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే బాలకృష్ణ,ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం స్టార్ డం కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాపయ్యాయి.. అలాంటి కళ్యాణ్ రామ్ కు ఈ మూడు సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అది ఏంటో ఒక సారి చూద్దాం..


కళ్యాణ్ రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన పటాస్, అతనొక్కడే,బింబిసారా మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.. ఇందులో బింబిసారా మూవీ మాత్రం ఇప్పటికే 22 కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసింది.. సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల పేరును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కానీ కళ్యాణ్ రామ్ కెరీర్లో పటాస్,అతనొక్కడే, బింబిసారా సినిమాలో కామన్ పాయింట్ ఒకే విధంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతనొక్కడే మూవీ లో కళ్యాణ్ రామ్ కొంతమందిని చంపుతూ విలన్లకు భయం కలిగేలా చేస్తూ ఉంటారు. ప్లాష్ బ్యాక్ లో కళ్యాణ్ రామ్ ఆ విధంగా చేయడానికి గల కారణం ఏంటన్నది తెలుస్తుంది.. ఇక పటాస్ మూవీ విషయానికి వస్తే ఇందులో కూడా కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపించారు.. ఆ తర్వాత కొన్ని మార్పులు వచ్చినా పోలీస్ ఆఫీసర్ గా మెప్పించారు.

Advertisement

Advertisement


ఇక బింబిసారా సినిమా విషయానికి వస్తే క్రూర మైనటువంటి రాజు పాత్రలో కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అహంభావంతో ప్రవర్తించే హీరో జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఘటన వల్ల మారడం గమనార్హం.. బింబిసారా మూవీ కళ్యాణ్ రామ్ కెరియర్ ను ఈ మలుపు తిప్పిందని చెప్పవచ్చు. అయితే ఈ మూడు సినిమాల్లో కళ్యాణ్ రామ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం, ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వడం చూస్తుంటే, అలాంటి పాత్రలు కళ్యాణ్ రామ్ కలిసి వస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే కళ్యాణ్ రామ్ రాబోయే మూవీ డెవిల్ పై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

also read:

Visitors Are Also Reading