Home » ఆ సినిమా నుండి దాస‌రి చిరంజీవిని త‌ప్పించాల‌ని చూశారా..? సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌పెట్టిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్..!

ఆ సినిమా నుండి దాస‌రి చిరంజీవిని త‌ప్పించాల‌ని చూశారా..? సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌పెట్టిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో స్టార్ ద‌ర్శ‌కుల వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పనిచేసి ఆ త‌ర‌వాత టాలెంట్ ను నిరూపించుకుని ద‌ర్శ‌కులుగా ఎదిగిన‌వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి ద‌ర్శ‌కుల్లో ద‌వ‌ళ‌స‌త్యం కూడా ఒక‌రు. దాస‌రి నారాయ‌ణ‌రావు వ‌ద్ద ద‌వ‌ళ‌స‌త్యం అసిస్టెంట్ డైరెక్టర్ గా ప‌నిచేశారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా జాత‌ర అనే సినిమాతో ద‌వ‌ళ‌స‌త్యం ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాగా రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌వ‌ళ‌స‌త్యం ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

Advertisement

తాను దాస‌రి వ‌ద్ద చాలా సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాన‌ని చెప్పారు. అంతే కాకుండా చిరంజీవితో ముందే ఓ సినిమా చేస్తాన‌ని చిరుకు మాట ఇచ్చాన‌ని చెప్పారు. కానీ జాత‌ర సినిమాకు అంద‌రూ కొత్త‌వాళ్లే అని అన్నారు. త‌న నుండి మొద‌లుకుని నిర్మాత‌, సంగీత ద‌ర్శ‌కుడు,కెమెరా మెన్ ఇలా అంద‌రూ కొత్త‌వాళ్లేన‌ని చెప్పారు. చిరంజీవిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవడం అందరికీ ఇష్ట‌మేన‌ని తెలిపారు.

Advertisement

అయితే గురువుగారు దాస‌రి నారాయ‌ణ‌రావు ఒక‌సారి త‌న‌తో అంద‌రూ కొత్త‌వాళ్లు ఉన్నారు క‌దా చిరంజీవి స్థానంలో మ‌రో కొత్త హీరోను తీసుకో అని స‌ల‌హా ఇచ్చార‌ని చెప్పారు. కానీ ఆ సినిమాలో హీరో పాత్ర‌కు చిరంజీవి చిరంజీవి క‌రెక్ట్ గా స‌రిపోతాడ‌ని న‌మ్మ‌కం ఉంద‌ని….చిరు ముఖంలో ఏదో ఫెయిర్ ఉంద‌ని దాస‌రితో చెప్పాన‌ని అన్నారు.

దాంతో దాస‌రిగారు ఏంట్రా ఆ న‌మ్మ‌కం చిరంజీవి స్థానంలో చంద్ర‌మోహ‌న్ ను హీరోగా పెట్టుకో అని అన్నార‌ని తెలిపారు. కానీ తాను ఆ పాత్ర‌కు చిరంజీవే న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని గురువుగారి మాట విన‌కుండా చిరంజీవితోనే సినిమా చేశాన‌ని చెప్పారు. అంతే కాకుండా యాంక‌ర్ జాత‌ర సినిమా రీసెంట్ గా వ‌చ్చిన రంగ‌స్థ‌లం ను పోలి ఉంటుంది క‌దా అని ప్ర‌శ్నించ‌గా…ఆ సినిమా క‌థ రంగ‌స్థ‌లం సినిమా క‌థ ఒక‌టేన‌ని అన్నారు.

Visitors Are Also Reading