Home » Pawan kalyan Kushi: ఖుషి-2 కు ప‌వ‌న్ నో చెప్పిన ప‌వ‌న్! ఇదిగో రీజ‌న్!!

Pawan kalyan Kushi: ఖుషి-2 కు ప‌వ‌న్ నో చెప్పిన ప‌వ‌న్! ఇదిగో రీజ‌న్!!

by Azhar
Ad

ఎస్‌.జె సూర్య డైరెక్ష‌న్ లో 2001లో రిలీజైన చిత్రం ఖుషి. ప‌వ‌న్ ను స్టార్ హీరోగా చేసిన సినిమా ఇదే. ఇక క‌లెక్ష‌న్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా ఖుషి ఒక సంచ‌ల‌నమ‌ని చెప్పుకోవొచ్చు.

Advertisement

అలాంటి ఖుషి సినిమా సీక్వెల్ కు ప‌వ‌న్ నో చెప్పార‌నే టాక్ న‌డుస్తోంది. దీనికి కొన్ని కార‌ణాలు కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Also Read: కూల్ డ్రింక్ యాడ్ కోసం మ‌హేశ్ ఎన్నికోట్లు పుచ్చుకున్నారో తెలుసా..?

Advertisement

ప‌వ‌న్ తో ఖుషి 2 చేయాల‌ని ద‌ర్శ‌కుడు ఎస్‌.జె సూర్య ఓ క‌థ‌ను కూడా రెడీ చేశాడ‌ట‌. అదే క‌థ‌ను ప‌వ‌న్ కు వినిపించాడ‌ట కూడా! అయితే ప్ర‌స్తుతం ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉండ‌డంతో ల‌వ్ స్టోరీలు చేస్తే త‌న ఇమేజ్ కు ఇబ్బందవుతుంద‌న్న కార‌ణంతో ఈ సినిమాకు నో చెప్పాడ‌ని టాక్!? ఎన్నిక‌ల కార‌ణంగా ప‌వ‌న్ ఎక్కువ రోజులు షూటింగ్ లో పాల్గొనే స‌మ‌యం కూడా లేకపోవ‌డం మ‌రో కార‌ణం.

అయితే ఖుషి ని మొద‌ట సూర్య హీరోగా త‌మిళ్ లో చేశారు. అది అక్క‌డ సూప‌ర్ హిట్ అయ్యింది. దాంతో అదే సినిమాను ఇక్క‌డ ప‌వ‌న్ తో రిమేక్ చేయించారు. ఇప్పుడు కూడా ఖుషి 2 ను మొద‌ట త‌మిళ్ లో రిలీజ్ చేయించి అక్క‌డ రిజ‌ల్ట్ ను బ‌ట్టి , కాస్త స్టోరీని ప‌వ‌న్ కు త‌గ్గ‌ట్టు మార్చి ఇక్క‌డ రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని ఆ వైపుగా ఆలోచిస్తున్నాడు ద‌ర్శ‌కుడు ఎస్ జె సూర్య‌!

Also Read: బెజవాడ బెంజ్ సర్కిల్లో కాంప్లెక్స్ ఒక్క‌టే మిగిలింది… రాజేంద్ర ప్రసాద్ కష్టాలు..!

Visitors Are Also Reading