Telugu News » Blog » బెజవాడ బెంజ్ సర్కిల్లో కాంప్లెక్స్ ఒక్క‌టే మిగిలింది… రాజేంద్ర ప్రసాద్ కష్టాలు..!

బెజవాడ బెంజ్ సర్కిల్లో కాంప్లెక్స్ ఒక్క‌టే మిగిలింది… రాజేంద్ర ప్రసాద్ కష్టాలు..!

by AJAY
Ads

రాజేంద్ర‌ప్ర‌సాద్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా ఇప్పుడు న‌టుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. కామెడీ ఎమోష‌నల్ ఇలా పాత్ర ఏదైనా రాజేంద్ర‌ప్రాసాద్ అందులో ప‌రకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. అయితే ఎన్నో సినిమాలు చేసిన రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆస్తులు మాత్రం పెద్ద‌గా సంపాదించుకోలేది తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో వెల్ల‌డించారు. త‌న‌కు బెంజ్ స‌ర్కిల్ ఒక కాంప్లెక్స్ మిగిలి ఉంద‌ని అంత‌కు మించి ఏమీ లేవ‌ని అన్నారు.

Ads
Rajendra prasad corona

Rajendra prasad corona

తాను ఎప్పుడూ ఆస్తుల గురించి లెక్క‌లు వేసుకోలేదని రెమ్యున‌రేష‌న్ కూడా ఎక్క‌వ డిమాండ్ చేయ‌లేద‌ని చెప్పారు. దానికి కార‌ణం తన‌ను తాను ఎప్పుడూ లెక్క‌పెట్టుకోలేద‌ని చెప్పారు. తీసుకునే డ‌బ్బును బ‌ట్టి త‌న‌ను ఎప్పుడూ అంచ‌నా వేసుకోలేద‌ని రాజేంద్ర ప్ర‌సాద్ తెలిపారు. త‌న‌కు వ‌చ్చే పాత్ర‌లే త‌న స్టేచ‌ర్ అనుకుంటాన‌ని చెప్పారు. తాను లోయ‌ర్ మిడిల్ క్లాస్ నుండి వ‌చ్చాన‌ని చెప్పారు.

also read : ఉద‌య్ కిర‌ణ్ భార్య విషిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…ఏం చేస్తుందంటే..!

Ads

rajendraprasad

త‌న తండ్రి ఒక స్కూల్ టీచ‌ర్ అని అందువ‌ల్లే త‌న‌కు ఎప్పుడూ కోటీశ్వ‌రుడిలా చేయాల‌ని అనిపించ‌ద‌ని అన్నారు. త‌న మ‌న‌స్థ‌త్వం అక్క‌డే ఆగిపోయింద‌ని తెలిపారు. తాను సినిమాలు చేసే సినిమాలు ఎంజాయ్ చేస్తాన‌ని చెప్పారు. తాను మ‌హేశ్ బాబును ఎంతో ఇష్ట‌ప‌డ‌తాన‌ని త‌న‌ను మ‌హేశ్ బాబు కూడా ఎంతో ఇష్ట‌ప‌డ‌తార‌ని అందువ‌ల్లే ఇద్ద‌రి మ‌ధ్య తెర‌కెక్కించే సీన్లు కూడా అద్భుతంగా వ‌స్తాయ‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు.

Ad

ఇదిలా ఉండ‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ రాజేంద్రుడు గ‌జేంద్రుడు సినిమాలో హీరోగా న‌టించారు. ఈ సినిమాతో పాటూ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేశారు. ఆ న‌లుగురు సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన పాత్ర ఎంతో ఎమోష‌న‌ల్ గా ఉంటుంది. ఈ సినిమా కూడా రాజేంద్ర‌ప్రసాద్ లోని న‌టుడిని చూపించింది.