Home » ఇండ‌స్ట్రీలో ఆ ఇద్ద‌రూ దిల్ రాజును తొక్కేస్తున్నారు…సంచ‌ల‌నం రేపుతున్న కేటీఆర్ కామెంట్స్..!

ఇండ‌స్ట్రీలో ఆ ఇద్ద‌రూ దిల్ రాజును తొక్కేస్తున్నారు…సంచ‌ల‌నం రేపుతున్న కేటీఆర్ కామెంట్స్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం బ‌డా ప్రొడ్యూస‌ర్ ఎవ‌ర‌ని అడిగితే ఆలోచించ‌కుండా చెప్పే పేరు దిల్ రాజు. ఒక‌ప్ప‌టి నిర్మాత‌లు చాలామంది ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డానికి వెన‌క‌డుగు వేస్తున్నారు. కానీ దిల్ రాజు మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్ గా కెరీర్ ను ప్రారంభించి దిల్ సినిమాతో నిర్మాత‌గా మారారు.

Advertisement

ఆ త‌ర‌వాత చాలా సినిమాల‌కు ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇక ఇక ఇప్పుడు స్టార్ హీరోల‌తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అయితే కేవ‌లం డ‌బ్బుల కోసం ఆశించ‌కుండా దిల్ రాజు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా చేస్తున్నారు. ఆ సినిమాల‌తో కొత్త‌వారికి లైఫ్ ఇస్తున్నారు. తాజాగా దిల్ రాజు బ్యాన‌ర్ నుండి అలాంటి సినిమా ఒక‌టి వ‌స్తుంది.

also read :IND VS AUS : ఓటమి ముంగిట ఇండియా.. రోహిత్ చేసిన ఈ 3 తప్పిదాలు ఇవే

Advertisement

అదే బ‌ల‌గం సినిమా…ఈ సినిమాకు క‌మెడియ‌న్ వేణు దర్శ‌కత్వం వ‌హించారు. ఈ సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి న‌టించాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేసింది. అంతే కాకుండా ఈ సినిమాను మార్చి3న విడుద‌ల చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సినిమాలో దిల్ రాజు కూతురు కూడా నిర్మాణంలో భాగ‌మ‌య్యారు. దాంతో కేటీఆర్ మాట్లాడుతూ..హ‌ర్షిత‌, హ‌న్షిత్ లు దిల్ రాజును ఇండ‌స్ట్రీలో తొక్కేస్తున్నార‌ని స‌రదాగా కామెంట్ చేశారు. వాళ్లు ఇండ‌స్ట్రీలో సక్సెస్ అవ్వాల‌ని అన్నారు.

ALSO READ :Virupaksha Teaser : “విరూపాక్ష” టీజర్ వచ్చేసింది… మరీ ఇంత సస్పెన్సా..?

Visitors Are Also Reading