Telugu News » Blog » చ‌ర‌ణ్‌తో న‌టించాలంటున్న కృతిశెట్టి

చ‌ర‌ణ్‌తో న‌టించాలంటున్న కృతిశెట్టి

by Anji
Ads

టాలీవుడ్‌లోకి ఉప్పెన చిత్రంతో ప‌రిచ‌య‌మైంది అందాల తార‌ కృతిశెట్టి. త‌న మొద‌టి చిత్రంతోనే భారీ విజ‌యాన్ని అందుకుంది. ఇక త‌న రెండ‌వ చిత్ర‌మైన శ్యామ్ సింగ‌రాయ్‌, మూడ‌వ చిత్ర‌మైన బంగార్రాజు ఇలా మూడు చిత్రాలు కూడా భారీ విజ‌యాన్నే అందుకున్నాయి. దీంతో ఈమ‌మె టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా మారింది. ఇక తాజాగా బంగార్రాజు స‌క్సెస్ ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె పాల్గొన్నారు.

Advertisement

Krithi Shetty Super Active In Bangarraju Promotions Tollywood Nagarjuna  Naga Chaitanya - Telugu Uppena-TeluguStop

ఈ సంద‌ర్భంగా కృతిశెట్టి త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ల‌ను బ‌య‌ట పెట్టింది. ఉప్పెన సినిమా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు మొద‌ట చేయాల‌ని అనుకోలేద‌ని.. క‌థ విన్నాక న‌చ్చి ఆ పాత్ర చేయాల‌ని అనుకున్న‌ట్టు వెల్ల‌డించింది. శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ అనే భావ‌న త‌న‌కు అస‌లు క‌లుగ‌లేద‌ని.. ఆ ఫీల్ రాకుండా చిత్ర బృందం త‌న‌ను బాగాచూసుకున్నారు అని చెప్పింది.

Advertisement

Advertisement

Krithi Shetty in Bangarraju first look poster - South Indian Actress

అంతేకాదు ఉప్పెన చిత్రంలో బేబ‌మ్మ పాత్ర‌కు పూర్తి విరుద్ధంగా తార పాత్ర ఉంటుంద‌ని, అందుకే శ్యామ్ సింగ‌రాయ్ ఒప్పుకున్న‌ట్టు చెప్పుకొచ్చింది. టాలీవుడ్ హీరోల‌లో ఎవ‌రితో న‌టించాల‌ని ఉంది అంటే..? ట‌క్కున మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరు చెప్పింది కృతిశెట్టి. రంగ‌స్థలం సినిమా చూసిన త‌రువాత ఆయ‌న న‌ట‌న‌కు ఫిదా అయిపోయాను అని, అందులో చ‌ర‌ణ్ చాలా అద్భుతంగా న‌టించార‌ని చెప్పింది. రామ్‌చ‌ర‌ణ్‌తో న‌టించాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌ట‌పెట్టింది కృతిశెట్టి. మ‌రీ ఆమె కోరిక త్వ‌ర‌లో తీరుతుందో లేదో చూడాలి.