Home » “కొత్త బంగారులోకం” హీరోయిన్ మరీ ఇలా మారిందేంటి..?

“కొత్త బంగారులోకం” హీరోయిన్ మరీ ఇలా మారిందేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కొంతమంది నటీనటులు ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. వారు ఎంత స్పీడ్ గా ఎదుగుతారో అంతే స్పీడ్ గా కనుమరుగైపోతూ ఉంటారు.. అలాంటి కోవకే చెందింది ఈ అందాల భామ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారులోకం సినిమాతో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరోయిన్ ఒక్క సినిమాతోనే టాప్ లెవల్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా ఆమె కెరియర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. అలాంటి హీరోయిన్ జీవితంలో కొన్ని అనివార్య ఘటనల వల్ల కెరియర్ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

Advertisement

Also read;వీర‌సింహారెడ్డి సినిమా నుండి డైలాగ్ లీక్… ఇది వింటే బాల‌య్య ఫ్యాన్స్ కు పూన‌కాలు పక్కా..!

Advertisement

ఆ తర్వాత ఆఫర్లు ఏవి రాకపోవడంతో సతమతమైంది. చివరికి దర్శకుడు రోహిత్ ను వివాహం చేసుకొని ఏడాది కాకుండానే మళ్లీ విడాకులు తీసుకుంది. అలాంటి హీరోయిన్ సినిమా ఆఫర్ల కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. మంచి పాత్రలు దొరికితే చేస్తానని అంటుంది. అలాంటి శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారులోకం సినిమాలో ఎంత క్యూట్ గా ఉందో మనందరికీ తెలుసు. ఆ సినిమాలో బొద్దుగా చూడ చక్కని అమ్మాయిలా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

అలాంటి ఈ అమ్మడు ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది. చాలా సన్నగా మారింది. సినిమా అవకాశాల కోసం గట్టిగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.. ఏది ఏమైనా కొత్త బంగారులోకం సినిమా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు.. ఆఫర్ల కోసం ఇంత కష్టపడి సన్నగా మారినా శ్వేతా బసు ప్రసాద్ కు మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

Also read;వాల్తేరు వీరయ్య ఫస్ట్ రివ్యూ.. సంక్రాంతికి చిరంజీవికి ఎలాంటి ఫలితం రానుంది?

Visitors Are Also Reading