Home » వీర‌సింహారెడ్డి సినిమా నుండి డైలాగ్ లీక్… ఇది వింటే బాల‌య్య ఫ్యాన్స్ కు పూన‌కాలు పక్కా..!

వీర‌సింహారెడ్డి సినిమా నుండి డైలాగ్ లీక్… ఇది వింటే బాల‌య్య ఫ్యాన్స్ కు పూన‌కాలు పక్కా..!

by AJAY
Ad

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమాకు గోపిచంద్ మ‌లినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు త‌మ‌న్ స్వారాలు స‌మ‌కూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన బాలయ్య పోస్టర్ మరియు పాటలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ అభిమానులతో స్టెప్పులు వేయిస్తోంది.

Advertisement

ఇక‌ సాధారణంగా బాలయ్య సినిమా అంటేనే విజిల్స్ కొట్టించే డైలాగులు ….. గూస్బమ్స్ తెప్పించే ఫైట్ సీన్ లు ఉంటాయి. వీర సింహారెడ్డి సినిమాలో కూడా అలాంటి డైలాగులు ఫైట్ సీన్ లు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. తండ్రి మరియు కొడుకు పాత్రల‌లో బాలయ్య నటించ‌నున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.

Advertisement

బాలయ్య శ్రుతి హాసన్ కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా…. ఇదిలా ఉంటే వీర సింహారెడ్డి సినిమా నుండి ఇప్పటికే ఓ డైలాగ్ లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ డైలాగ్ నెట్టింట‌ వైరల్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం…. పులివెందుల అయినా.. పులిచెర్ల అయినా పులిబిడ్డ ఈ వీర సింహారెడ్డి.. ఈ వీర సింహారెడ్డి ప్రజల ముందు ఉంటే సింహం ముందు ఉన్నట్టే.

ఇక ఈ డైలాగ్ లీక్ అవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజ‌న్లు ఈ డైలాగ్ ను చూసి సినిమాలో మరిన్ని డైలాగ్ లు ఉండబోతున్నాయి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. బాలయ్య కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల‌ బడ్జెట్ తో తెర‌కెక్క‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి సినిమా ఎలాంటి విజ‌యం సాధిస్తోందో చూడాలి.

ALSO READ :అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!

Visitors Are Also Reading